మీరు తరచుగా నీరస పడుతున్నారా అయితే మీలో ఆ లోపం ఉన్నట్టే

Untitled design (78)

Teluguwonders:

ఐరన్ అంటే ఏమిటి అసలు మనకు అది ఎందుకు అవసరం?
ఐరన్ లోపం ఏమిటి మరియు ఎందుకు ఆందోళన చెందాలి?అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

👉ఐరన్ డెఫిషియన్సీ సంకేతలు మరియు లక్షణాలు:

1.శ్వాస యొక్క కొరత శ్వాస లోపం
2. లేత చర్మం
3.తలనొప్పి మరియు మైకము
4. గోళ్లు పగులుట
5. జుట్టు రాలడం, పొడిగా మరియు బలహీనంగా మారడం

👉ఐరన్ డెఫిషియన్సీ ఉందని మీరు భావిస్తే ఏమి చేయాలి?

👉మీరు ఇనుము-లోపము రక్తహీనత కలిగివుంటే, కింది సలహాలును పరిశీలించండి:
ఐరన్ డెఫిషియన్సీ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే
శిశువులు మరియు పిల్లల్లో అత్యధిక ప్రమాదం ఉంది.
ఐరన్ డెఫిషియన్సీ నివారించడానికి చేయవలసినవి?
ఇనుము స్థాయి ఎక్కువుగా ఉన్న ఆహార పదార్ధాలు.
మనకు ఎందుకు అవసరం? అంటే..
ఐరన్ మానవ శరీరంకు ఒక అత్యంత అవసరమైన ఖనిజం. మానవ శరీరంలో రక్తమును ఎర్రగా చేయడానికి తోడ్పడుతుంది మరియు రక్తం పనితీరుకు ఉపయోగపడుతుంది. ఐరన్ లోపం అత్యంత సాధారణ పోషకాహార లోపం, ఇది తరచూ అలసటకు దారితీస్తుంది, పిల్లలకు మరియు పెద్దలకు మానసిక పనితీరును ఆలస్యం చేయగలదు. ఐరన్ అనేక ఎంజైమ్లలో భాగం మరియు పలు సెల్(కణం) ఫంక్షన్లలో ఉపయోగిస్తారు.

ఎంజైములు మానవ శరీరంలో ఆహరంను జీర్ణం చేసేందుకు సహాయం చేస్తాయి మరియు మానవ శరీర భాగాలలో జరిగే అనేక ముఖ్యమైన ప్రతిచర్యలతో కూడా సహాయం చేస్తాయి. మన శరీరానికి తగినంత ఇనుము లేనప్పుడు, మన శరీరాలలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. ఉదాహరణకు, ఇనుము (ప్రోటీన్ హేమోగ్లోబిన్లో భాగంగా) మన శరీరమంతా, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకుంటుంది. చాలా తక్కువ CV కలిగి ఉంటే రక్తహీనత అంటారు.

శరీరం అనేక ధాతువుల సమ్మేళనం జీవక్రియలు సజావుగా సాగడానికి వివిధ ధాతువులు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపించినవుడు కొన్ని సంకేతాలను ముందుగా పంపుతుంది. వాటిని పసిగట్టి, జాగ్రత్త పడితే ఆరోగ్య సమస్యలు దూరంగా ఉండవచ్చు.
• శరీరం పంపే సంకేతాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇక కష్టాలే

🔴అనారోగ్య సమస్యలు :

మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాల లో ఐరన్ కూడా ఒకటి. ఇది
లోపిస్తే రక్తహీనత వస్తుంది. దాంతో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు
కూడా చుట్టుముడతాయి.

• ఐరన్ లోపం ఉన్న వారిలో ప్రధానంగా కనిపించే సమస్య తొందరగా అలసిపోవడం. చిన్నచిన్న పనులకె వీరు ఎక్కువగా ఆలసిపోతారు. దీనితో పాటు , బలహీనపడడం, పని పై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

• నిద్రలో కాలు అదే పనిగా కదుపుతుండడం, మధ్య మధ్యలో గోక్కుంటూ ఉండటం ఐరన్ లోపానికి సంకేతం.

• ఐరన్ లోపం తో రక్తహీనత వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
* చర్మం పాలిపోతుంది. పెదవుల లోపలి భాగంలో కళ్ళు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది.

• తరచుగా నిద్రపోవాలి అనిపించడం, కారణం లేకుండానే నీరసం
* చర్మం కాంతి తగ్గడం, నిర్జీవంగా మారడం, ముఖంపై పసుపుదనం
రావడం.

• తరచు తలనొప్పి తో బాధపడుతున్నా- ఐరన్ లోపం కారణం కావొచ్చు.

• చిన్న ఆందోళన కే గుండె వేగంగా కొట్టుకోవడం, గోళ్లు పెళుసుగా మారడం
కూడా దీని లక్షణాలే.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights