జగన్ కి మరో సవాల్ విసిరిన చంద్రబాబు

jagan_babau

Teluguwonders:ఏ రంగంలోనైనా అనుభవజ్ఞులైన వ్యక్తులు ఆ రంగంలో తమ తర్వాత వచ్చే కొత్త వ్యక్తులకు కొన్ని సవాళ్ళు విసురుతూ ఉంటారు . అవి సామర్థ్యాన్ని పరీక్షించడానికి అయినా అవ్వచ్చు లేదా పక్కవారి అసమర్థతని నిరూపించడానికి అయినా అవ్వచ్చు .ఇది ఏ రంగంలోనైనా సాధారణమే . అయితే కొంతమంది ఈ సవాళ్లను గెలవలేక ఓడిపోతే , మరికొంతమంది మాత్రం ఈ సవాలును ఛాలెంజింగ్గా తీసుకుని ధైర్యంగా నిలబడతారు. తామేంటో నిరూపించుకుంటారు.

🔴విషయం లోకి వెళ్తే ; మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏప్రిల్ 11 న , పోలింగ్ అయినప్పటి నుంచి ఆయన తన గెలుపుపై ధీమా గానే ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠం తనదే అని ,వచ్చే ప్రభుత్వం మనదే అని ,తనని మోసం చేసుకోవడమే కాకుండా పార్టీ సభ్యులను కూడా మోసం చేశారు .కానీ మే 23 తర్వాత వాతావరణం అంతా మారిపోయింది .వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో ఈ ఎన్నికల ఫలితాలలో నెగ్గారు . దాంతో చంద్రబాబునాయుడు ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది .ఆయన ఆ ఫలితాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పార్టీ లీడర్ లకు శ్రేయోభిలాషులకు బదులు చెప్పుకోలేకపోతున్నారు. దాంతో జగన్ ను ఏదోరకంగా ఇరకాటంలో పెట్టాలని ,ఇరకాటంలో పెట్టే అవకాశం వస్తుందని చంద్రబాబు నాయుడు ఎదురుచూస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా మరియు వేగంగా ప్రభుత్వాన్ని నడపడంతో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడికి ఆ అవకాశం చిక్కలేదు.
అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కి జగన్ ను ఇరకాటంలో పెట్టే ఒక అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

👉ఇదే అవకాశంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఓ కొత్త డిమాండ్ ఉంచారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ప్రకటించిన రైతు భరోసా ని అమలు చేయాలని ఆయన సూచించారు . అయితే హామీ ఇచ్చిన రైతు భరోసా రబీ నుంచి అమలు చేస్తామని వైసిపి ప్రకటించింది .దాంతో

🔴 ఖరీఫ్‌‌ రైతులకు న్యాయం జరగాలని ; రైతు భరోసా రబీ నుంచి అమలు చేసే ప్రకారం అయితే ,ఈలోగా ఖరీఫ్‌‌లో ైతులకు ఉపయోగపడేలా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారబోవని అలా మారితే కొత్త ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారని ,ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి తప్పు జరగకుండా ప్రజలకు మేలు కలిగే పథకాలు పద్దతులు ,అమలులో ఉండాలని ఆయన సూచించారు .

👉టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష ; అయితే టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష లో..రుణమాఫీ అంశంపై కూడా చర్చ జరిగింది.

🔴రైతుల రుణ మాఫీ ; జగన్ ప్రభుత్వం వస్తే రుణమాఫీ కూడా అమలవుతుందని రైతులు ఆశించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ 4, 5 విడుతలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనన్నారు. లేదంటే రుణమాఫీపై న్యాయపరమైన హక్కు ఉన్నందున రైతులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు.. చంద్రబాబుకు సూచించారు. ప్రభుత్వాలు మారినా విధానాలు మారవన్న చంద్రబాబు యూపీఏ తీసుకొచ్చిన పథకాన్ని ఎన్డీయే కొనసాగించిందని చెప్పారు. హామీ లో చెప్పినట్లు గా రైతులకు రుణమాఫీ జరగాలని చంద్రబాబు సూచించారు. 👉చూద్దాం ..చంద్రబాబు ఉంచిన ఈ సవాళ్లను సీఎంజగన్ ఎలా ఎదుర్కొనబోతున్నారో ..!!!


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights