జగన్ మహేష్ బాబు చెప్పిందే follow అవుతున్నాడు..

ఏ గ్రామానికి కావాలసిన పథకాలను ఆ గ్రామమే రూపొందించుకోవడం..అనేది గ్రామ సచివాలయం..యొక్క విధి విధానం. ఇదే మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాలో చర్చించిన కాన్సెప్టు.. అంటే మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. అదే విధం గా గ్రామ సచివాలయాన్ని రూపొందించాలని కొత్త సీఎం జగన్ ప్రకటించారు.
🔴ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్:
ప్రమాణ స్వీకార వేదికపైనే ఆయన ఈ ఆలోచన వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు.. అమలు చేసేందుకు.. అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు.
🔴ఆగస్టు 15 నాటికి అమలు :
గ్రామ వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల జీతం ఇస్తారట. ఈ పథకాన్ని వచ్చే ఆగస్టు 15 నాటికి అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం దాదాపు 4 లక్షల మంది గ్రామాల్లో చదువుకున్న యువకులకు వాలంటీర్లగా ఉద్యోగ అవకాశం వస్తుంది.
👉ఈ గ్రామ సచివాలయం- వాలంటీర్ల ఐడియా బాగానే ఉంది. కానీ ఇప్పటికే అమల్లో ఉన్న వీఆర్వో, గ్రామ కార్యదర్శిలకు వీటిని ఎలా అనుసంధానం చేస్తారో చూడాలి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
