రాజధాని అమరావతే … క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

jagans

మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం చేసిన ఒక ప్రకటన తో  రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు.

అన్ని జిల్లాల ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. రాజధాని సహా జిల్లాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే రాజధాని భవితవ్యం తేలుతుందన్నారు.

కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనితో Amaravathiప్రాంత ప్రజలల్లో ఒకరకమైన భయం ఏర్పడింది.

Andhrapradesh  ముక్కలు గా విడిపోయిన తరువాత నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ని గత ప్రభుత్వం అమరావతిగా నిర్ణయించిన సగంతి తెలిసిందే. అలాగే కొద్దిరోజులు హైదరాబాద్ వేదికగా జరిగిన ఏపీ పరిపాలన ..ఆ తరువాత పూర్తిగా అమరావతి కి మార్చేశారు.

Amaravathi  లో తాత్కాలికంగా అసెంబ్లీ సచ్చివాలయం ఏర్పాటు చేసుకొని అక్కడినుండే పాలన కొనసాగించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించి ..అధికారంలో వచ్చింది. దీనితో మళ్లీ రాజధాని వ్యవహారం మొదటికి వచ్చింది.

దీనిపై తాజాగా జగన్ సర్కారు క్లారిటీ ఇచ్చింది. రాజధాని అమరావతి లోనే ఉంటుందని స్పష్టం చేసింది.

శుక్రవారం శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాజధానిని అమరావతిని తరలించడం లేదని ఆయన తెలిపారు.

మంత్రి బొత్స ప్రకటనతో రాజధాని విషయంలో గత ఆరు నెలలుగా నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది.
[the_ad id=”4850″]
ఇకపోతే  జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత ఇండియా మ్యాప్ను విడుదల చేసిన కేంద్రం.. ఏపీ రాజధానిని అందులో చూపలేదు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. అమరావతితో కూడిన కొత్త మ్యాప్ను కేంద్రం విడుదల చేసింది. ఆ తర్వాత అమరావతి నిర్మాణాల్లో వేగం పెంచాలని Jagan సర్కారు అధికారులను ఆదేశించింది.

Amaravathi కేంద్రం ప్రకటన తర్వాత జగన్ సర్కారు వైఖరి మారిందనే భావన వ్యక్తం అవుతోంది. అయితే రాజధాని నిర్మాణం విషయం లో గత ప్రభుత్వమైనా టీడీపీ కి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కి చాలా వ్యత్యాసం ఉంది. వైసీపీ సర్కార్ గత ప్రభుత్వం మాదిరి హంగు ఆర్భాటాలకు పోకుండా ..వాస్తవికతకు దగ్గర ఉండేలా నిర్మాణం చేప్పట్టబోతోంది అని తెలుస్తోంది.

 

[the_ad id=”4846″]

 


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights