జగన్ నువ్వు మగాడివి అంటున్న ప్రముఖ జర్నలిస్టు

n203349300d1f0a7cbd5811bb78afe1fa050320a64b7d1aa2204a540d8557715eee0548fc0__01.jpg

ఏపీలో కరోనా కేసులు పాపంలా పెరిగిపోతున్నాయి. మొదట్లో వందల్లో వచ్చేవి.. ఇప్పుడు ఏ జిల్లాలోనూ రోజూ వందకు తగ్గకుండా కేసులు వస్తున్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఏకంగా రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు వస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద రోజూ పదివేల కొత్త కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి.

జగన్ సర్కారు దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేయిస్తోంది. రోజూ 50- 60వేల టెస్టులు చేయిస్తోంది. కానీ.. మిగిలిన రాష్ట్రాలు చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయించకుండా.. తక్కువ టెస్టులు చేసి తక్కువ కేసులు వచ్చాయని ఫీలవడం కంటే..

ఎక్కువ టెస్టులు చేసి.. ఎక్కువ కేసులు వచ్చినా పరవాలేదన్న ధోరణి ఏపీలో ఉంది. దీని వల్ల ముందు భయపడినా ఆ తర్వాత చికిత్స మొదలవుతుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది.

తక్కువ టెస్టులు చేయించడం అంటే.. ఉన్న రోగాన్ని దాచుకుని.. అది ప్రాణాల మీదకు వచ్చే వరకూ ఎదురుచూడటమే కదా. అందుకే జగన్ సర్కారు కేసుల సంఖ్యకు భయపడటం లేదు. విపక్షాల విమర్శలకు భయపడటం లేదు. విరివిగా టెస్టులు చేయిస్తున్నారు. జగన్ సర్కారు వైఖరిని ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ మెచ్చుకున్నారు.

ఏపీలో కేసులు పెరుగుతున్నా, ఏపీ సర్కార్‌ టెస్టులు తగ్గించకపోవడం అభినందనీయమన్నారు రాజ్‌ దీప్ సర్దేశాయ్. కొన్ని రాష్ట్రాలలో కరోనా లెక్కలను దాస్తున్నారని.. కానీ ఆంధ్ర ప్రదేశ్‌లో అలా చేయడం లేదని ఆయన కితాబిచ్చారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలని సర్దేశాయ్ సూచించారు. నిజమే కదా.. ఇప్పుడు విపక్షాల విమర్శలకు భయపడి టెస్టులు చేయడం తగ్గించి.. కరోనా కేసుల సంఖ్యను దాచి చెబితే.. ముందు ముందు అదే విపక్షాలకు మరింతగా దొరికిపోవడం ఖాయం. ఏం చేసినా ధైర్యంగా చేసేయడమే తన లక్షణమని మరోసారి జగన్ నిరూపించాడు.

https://platform.twitter.com/embed/index.html?dnt=false&embedId=twitter-widget-0&frame=false&hideCard=false&hideThread=false&id=1289433107125293056&lang=en&origin=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F&theme=light&widgetsVersion=223fc1c4%3A1596143124634&width=550px


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights