మీరు reliance జియో ఉద్యోగులా..అయితే అర్జంట్ గా మరొక ..జాబ్ చూసుకోండి..

0

ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో సంస్థ లో టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి 👉సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. .

🔴భారీగా ఉద్యోగుల తొలగింపు : ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. 🔴తొలగింపునకు కారణాలు:వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్ మార్జిన్ల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. జనవరి -మార్చి త్రైమాసికంలో రిలయన్స్ జియో ఆపరేటింగ్ మార్జిన్ 5 బేసిస్ పాయింట్ల తగ్గుదలతో 39 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. కంపెనీ వ్యయాలు క్వార్టర్ పరంగా చూస్తే దాదాపు 8 శాతం పెరిగాయి.

👉పర్మనెంట్ స్టాఫ్ ని కూడా : జియో తొలగించనున్న ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌తోపాటు కొంత మంది పర్మనెంట్ స్టాఫ్ కూడా ఉండే అవకాశముంది.
🔴5,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్:
జాతీయ మీడియా కథనం ప్రకారం.. రిలయన్స్ జియో ఇప్పటికే దాదాపు 5,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ చూపించినట్లు తెలుస్తోంది. 👉ఇందులో 600 మంది వరకు పర్మనెంట్ ఉద్యోగులు ఉండే అవకాశముంది. 🔹మరోవైపు రిలయన్స్ జియో మాత్రం వ్యయాల నియంత్రణకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదని, ఉద్యోగులను నియమించుకుంటూనే ఉంటామని పేర్కొంది.

Leave a Reply