సంచలనం సృష్టించబోతున్న జియో గిగా ఫైబర్ :రూ.600లకే కేబుల్ టీవీ కాంబో

0

అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాల్స్‌, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్‌ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది.
🔴 రిలయన్స్‌ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే రూ.4,500 రీఫండబుల్ డిపాజిట్ తప్పనిసరి
గతేడాది ఆగస్టులో జియో గిగాఫైబర్‌ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దశల వారీగా ప్రముఖ పట్టణాల్లో దీన్ని విస్తరిస్తోంది. జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకునేవారు 👉వన్‌టైమ్‌ సెక్యురిటీ డిపాజిట్‌ కింద రూ.4,500 (రీఫండబుల్‌) చెల్లించాలి. మూడు నెలల పాటు నెలకు 100ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.
600 టీవీ చానెళ్లు అందించాలని రిలయన్స్ జియో లక్ష్యం
బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబోలను నెలకు రూ.600లకే వినియోగదారులకు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 👉 ఈ ఆఫర్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటు, 600 టెలివిజన్‌ ఛానళ్లు, 100ఎంబీపీఎస్‌ బ్రాండ్‌ సేవలను పొందవచ్చు.
🔴ఇలా రూటర్ ద్వారా 40-45 డివైజ్‌లకు అనుసంధానం :
ప్రస్తుతం జియో అందిస్తున్న రూటర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్స్‌, స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్‌ సహా దాదాపు 40-45 డివైజ్‌లను కనెక్ట్‌ చేసుకోవచ్చని చెబుతోంది. అయితే ఇందుకు నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెట్‌వర్క్‌ సీసీటీవీ, ఇతర క్లౌడ్‌ నెట్‌వర్క్‌ కోసం వినియోగించుకోవచ్చని చెబుతోంది.
ఢిల్లీ, ముంబై నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా గిగా ఫైబర్ నెట్ వర్క్ పరిశీలన
ప్రస్తుతం ముంబై, ఢిల్లీల్లో పైలట్ ప్రాజెక్టు కింద గిగా ఫైబర్ నెట్ వర్క్ పనితీరును రిలయన్స్ జియో పరీక్షిస్తోంది. వచ్చే మూడు నెలల్లో టెలిఫోన్ నుంచి టెలివిజన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో వన్ టైమ్ సెక్యూరిటీ రూ.4500 చెల్లించి సభ్యులుగా చేరిన వారికి ఏడాది పాటు ఉచితంగా టీవీ చానెళ్ల సరఫరా సౌకర్యం కల్పిస్తోంది రిలయన్స్ జియో.
🔴1600 నగరాలకు విస్తరించిన రిలయన్స్ ఫైబర్ నెట్ వర్క్ :
గతవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో ఇప్పటికే 1600 నగరాల పరిధిలో సేవలందిస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.
🔴భారతీ ఎయిర్ టెల్ :
దీని ప్రత్యర్థి భారతి ఎయిర్ టెల్ తొలుత ప్రీమియం కస్టమర్లలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందునా 100 టాప్ నగరాల్లో విస్తరిస్తే సరిపోతుందని భావించింది. కానీ రిలయన్స్ జియో గిగాఫైబర్‌ ద్వారా గేమింగ్‌, క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టెలివిజన్‌ వంటి సేవలతోపాటు స్మార్ట్‌ హోమ్‌ సిస్టమ్‌ సేవలను సైతం పొందవచ్చు. స్మార్ట్‌ హోమ్‌ సిస్టమ్‌తో ఇంటిని పూర్తి స్మార్ట్‌గా మార్చుకొనే వీలుంటుంది.

Leave a Reply