ఈ నెల 26న నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు.

jobs-in-png-4

నవులూరు:మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈనెల 26వ తేదీ బుధవారం అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎస్.బీ.ఐ,హెచ్.డి.ఎఫ్.సీ. ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్.బీ.ఐ.లో ఖాళీగా ఉన్న 30 బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు…హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఖాళీగా ఉన్న 30 కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు. ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకులో ఖాళీగా ఉన్న 50 సేల్స్ ఆఫీసర్స్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్,డిగ్రీ,పీ.జీ చదివిన విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి రూ.12,000/-నుంచి రూ.14,000/- వరకూ జీతం చెల్లిస్తారు. కావున మండలంలోని ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇయర వివరాలకు సెల్: 97000 25833 లలో సంప్రదించగలరు.ఎన్.నాగరాజు, జర్నలిస్ట్, మంగళగిరి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights