అభిమాని కోసం ఆవేదన పడిన Jr ఎన్టీఆర్

jrntr

jrntr

Jr NTR: తను ఎదగడానికి కారణం అయిన వారిని,ఎదగడానికి ప్రోత్సాహించిన వారిని ఎవరూ మరిచిపోరు. ఓట్ వేసిన ప్రజలకి నాయకులు, తమని ఆదరించి ఇంత వాళ్ళని చేసిన అభిమానులను హీరోలు కూడా అదే విధంగా మర్చిపోలేరు,మరిచిపోకూడదు కూడా.     విషయంలోకి వెళ్తే : కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు అయిన జయదేవ్ ఈ రోజు చనిపోవడం తో అది తెలుసుకున్న

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో కలత చెందారు. ఎప్పుడూ అభిమానుల బాగును కోరుకునే ఆయన అభిమాన దేవుళ్లు లేకపోతే తాను లేనని అంటుంటా రు. ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. మీకోసం మీ వాళ్లు ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు దయచేసి సురక్షితంగా తిరిగి వెళ్లండి అంటూ సూచిస్తారు. అంతలా అభిమానులపై ప్రేమను పెంచుకునే ఎన్టీఆర్‌ నేడు ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది.                      ఈ మేరకు జయదేవ్‌ను గుర్తుచేసుకుంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ :

“నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్‌ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో మొదలైన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చూసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడుగా ఉన్న వారిలో జయదేవ్‌ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్‌ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. జయదేవ్‌తో దిగిన ఫొటోను సైతం పోస్ట్ చేశారు. ఒక అభిమాని కోసం ఆయన పడిన ఆవేదన అందర్నీ కలిచివేస్తుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights