K Ramp Movie: కిరణ్ అబ్బవరం మాస్ డ్యాన్స్.. ట్రెండింగ్లోకి ఇదేమిటయ్యా మాయా సాంగ్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన “ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా.. ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను.. ఏకం కమ్మందా” సాంగ్ మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు కె ర్యాంప్ చిత్రంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డ్యాన్స్ అదరగొట్టారు. తెల్ల చొక్క, గల్లా లుంగీలో మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. థియేటర్లలో ఈ సాంగ్ వచ్చినప్పుడు అడియన్స్ చేసే ఎంజాయ్ గురించి చెప్పక్కర్లేదు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. క సినిమా తర్వాత ఆ స్థాయిలో కె ర్యాంప్ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడు. దీపావళీ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోసారి కిరణ్ యాక్టింగ్ అదరగొట్టాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో కిరణ్ జోడిగా యుక్తి తరేజా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అంటూ సీనియర్ హీరో రాజశేఖర్ పాటను రీక్రియేట్ చేశారు. ఈ పాటలో మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. మూవీ ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. ఇక ఈ పాట ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రచ్చ చేస్తుంది.
సినిమాకు మంచి ఎనర్జీ ఇచ్చిన ఈ పాట వీడియోను గురువార యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదేమిటమ్మా మాయ ఒరిజినల్ సాంగ్ సైతం ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇంతకీ ఈ సాంగ్ ఏ సినిమాలోనిది గుర్తుకు వచ్చిందా.. ? సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోనిది. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ చిత్రానికి వందేమాతంర శ్రీనివాస్ సంగీతం అందించగా.. చిన్న చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ పాటలో రాజశేఖర్ తో పాటు హీరోయిన్ గుర్లీన్ చోప్రా కనిపించగా.. ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పుడు ఈ పాటలో కనిపించిన హీరోయిన్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇందులో నటించిన గుర్లీన్ చోప్రా .. చండీగడ్ కు చెందిన అమ్మాయి. ఆయుధం సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత ఒక పెళ్లాం ముద్దు, రెండో పెళ్లాం వద్ద.. నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో నటించింది. 2020 నుంచి సినిమాలకు దూరంగా ఉండిపోయింది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సిలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్ సైట్ నడిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
