నా అందం ఏంటో నాకు తెలుసు: కాజల్

టాలీవుడ్ లోకి ‘లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతో పెద్దగా ఇంప్రెస్ చేయకున్నా తర్వాత ఈ అమ్మడి అందానికి దర్శక, నిర్మాతల ఫిదా అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఈ ఒక్క మూవీ కాజల్ రేంజ్ ని ఎక్కడికో తీసుకు పోయింది. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాత తర్వాత కాజల్ తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో నటించిన ఏకైక బ్యూాటీగా పేరు తెచ్చుకుంది.
కాజల్ సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు దాటినా ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూనే ఉంది.
ఈ కలువకళ్ల సుందరి ఇప్పుడు కుర్ర హీరోల సరసన కూడా నటిస్తుంది. కాకపోతే ఈ మద్య తెలుగులో ఛాన్సులు తక్కువ అయ్యాయి. ఆ మద్య బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తుంది. అంతే కాదు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్2’ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీలో కాజల్ 80 ఏళ్ల బామగా కనిపించబోతుందట.
ఈ మూవీ కోసం తెగ కష్టపడుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అయితే తన అందం.. మెకప్ గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ.. అందరు హీరోయిన్లలా తనకు మేకప్ అవసరం లేదనీ, తనది సహజమైన అందమనీ, తనకు ఎలాంటి మేకప్ లేకున్నా అందంగానే కనిపిస్తానని చెబుతోందట కాజల్. నేను మేకప్ వేయాలని ఎవరిని కోరను. నన్ను అందంగా చూపించడానికి డైరెక్టర్ తాపత్రయ పడుతుంటారు… అందుకే మేకప్ వేస్తారు. నా అందం ఏంటో నాకు తెలుసు అంటుంది ఈ కలువ కళ్ల సుందరి.
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
