కోడెల ఆత్మహత్య..? ఎన్నో అనుమానాలు..!

Teluguwonders:
ఏపీ మాజీ సీఎం స్పీకర్ కోడెల సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
అయితే.. ఆయన గుండెపోటుతోనే కన్నుమూసినట్లు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని కోడెల అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కొడుకుతో ఉన్న తగాదాల కారణంగానే.. ఆయన సూసైడ్ అటెమ్ట్ చేశారనే.. వాదనలు కూడా వినవచ్చాయి.
గత కొద్ది కాలం కిందట సడన్‌గా హార్ట్‌ఎటాక్‌కి గురైన.. కోడెల.. అల్లుడి ఆసుత్రిలోనే చికిత్స చేయించుకున్నారు. అయినా.. కోడెల శివప్రసాద్ చనిపోయి ఇంత సమయం గుడుస్తున్నా.. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బసవతాకం వైద్యులు కూడా.. మరణ వార్తను ధృవీకరించారే తప్ప.. ఏ కారణం చేత చనిపోయారో తెలుపలేదు.
మరో ప్రశ్న ఏంటంటే.. ఆయన్ని చనిపోయిన తరువాతనే బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోడెల బంజారాహిల్స్‌లో నివాసం ఉంటే.. దగ్గరలో హాస్పిటల్స్ ఉండగా.. క్యాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా.. ఆయనకు ఆత్మహత్య చేసుకుని చనిపోయేటంత అవసరం ఏంటని.. పలు రకాల మాటలు వినిపిస్తున్నాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
