ఈ వేసవిని జయించండి..ఇలా:

Spread the love

వేసవి కాలం  లో ఏం తినాలి, ఎలా ఉండాలి..

🔆ఋతువు కి ఋతువుకి మన శరీర తత్వం మారిపోతూ ఉంటుంది.మనం తీసుకునే ఆహారం ,మారే ఈ శరీరతత్వాన్ని బట్టి తీసుకోవాలి. లేదంటే చాలా శారీరక సమస్యలు,ఆరోగ్య సమస్య ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి,ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి.ముఖ్యం గా ఇప్పుడు మనం ఉన్నది గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ,ఎలా ఉండాలో తెలుసుకోవాలి

🔆గ్రీష్మ ఋతుచర్య : ఈ ఋతువులో అంటే ఈ ఎండాకాలం లో.. సూర్యుడు తన కిరణాలతో మన దేహంలో ఉండే తేమను  బయటకు లాగేస్తాడు. ఫలితంగా మనం బలహీన పడిపోతాం కాబట్టి ముందుగా మనం ఎండాకాలంలో తీసుకోవాల్సిన ద్రవ పదార్థాల గురించి తెలుసుకుందాం.

🔅 తీసుకోవాల్సిన ద్రవ పదార్థాలు : ఈ కాలంలో మనం ఎక్కువగా కృత్రిమ పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ మీద ఆధారపడటం  వల్ల ఆరోగ్యానికి చాలా హాని చేసిన వారౌతాం.కాబట్టి కూల్డ్రింక్స్ మీద ఆధారపడడం మానేసి వాటి స్థానంలో కొబ్బరి నీరు ,సబ్జాగింజలు ఇంకా సగ్గు బియ్యం నీరు లాంటివి..తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది .మరో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మనం తరుచుగా తీసుకునే టీలు ,కాఫీలు వంటి  పదార్ధాలు కూడా మానివేయడం చాలా మంచిది .తరచుగా ఎక్కువగా నీటిని తీసుకోవాలి .దీని వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి మనం త్వరగా నీరసపడకుండా ఉంటాం.శరీరాన్ని శుద్ధంగా ఉంచిన వారవుతాం. ఇక ఈ కాలంలో

🔅తీసుకోవలసిన ఘన పదార్థాలు : ఈ కాలంలో మనం తీపి పదార్దాలు,కొవ్వు ఉండే ఒమెగా 3: సాల్మన్ మరియు ట్యూన చేపలు, అక్రోలు, సొయా పదార్దాలు, ఆకు కూరలు, చిక్కుళ్ళు వంటివి  తీసుకోవాలి .

🔅తినకూడని పదార్దాలు:చాక్లెట్, కేక్లు, వెన్న,లాంటివి మానేయ్యలి.ఉప్పు, పులుపు ,ఘాటు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది .

🔆ఇవి మాత్రమే కాకుండా   పగటిపూట నిద్రపోవడం చాలా మంచిది..శారీరక శ్రమ మరియు శృంగార సంభోగం వీలైనంతవరకు తక్కువస్థాయిలో ఉంచుకోవటం మంచిది.

🔅దుస్తులు :  దుస్తుల విషయం లో..అయితే వదులుగా ఉండి చెమటను త్వరగా పీల్చుకోగల కాటన్ దుస్తులు..శరీరాన్ని వీలైనంత పూర్తిగా కప్పి ఉంచుకునే విధంగా ధరించాలి

🔅ఈ విధమైన ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వేసవి కాలాన్ని  చాలా వరకు జయించ వచ్చు..


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading