మనమెప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.లేదంటే మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
👉మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు :మెదడు సమస్యల్లో ముఖ్యమైనది పక్ష వాతం,మతి మరుపు, ఒక వయసు
తర్వాత అల్జిమర్స్ వంటివి. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడు ను చురుకుగా ఉంచడానికి దోహదపడతాయి.
🔅మెదడు ను చురుకుగా ఉంచే ఆహారాలు : చేపలు తీసుకోవడం మెదడుకు అన్నివిధాలా మేలు చేస్తుంది. మెదడు చురుకుదనానికీ ఇది బాగా దోహదపడుతుంది. చేపల్లో రకాలైన పండు చేప పంగుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్) వంటివి ఎక్కువగా తీసుకోవాలి .వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
🔅మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనె : ఆలివ్ ఆయిల్ . ఉపయోగాలు : ఆలివ్ ఆయిల్ రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్టోక్),అల్జిమర్స్ వ్యాధులను నివారిస్తుంది .
🔅మెదడుకు మేలు చేసే పండ్లు:బెర్రీలు స్ట్రాబెర్రీ,బ్లూబెర్రీ, వంటి బెర్రీలు..నేరేడు పళ్ళు వంటివి మెదడుకు చాలామంచివి .
🔅తినవల్సిన కూరగాయలు, ఆకుకూరలు: పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుకు రక్షణకల్పిస్తాయి .👉వీటితో పాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.
🔅మెదడుకు హాని చేసే ఆహారాలు : నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్స్డ్ సూప్స్ తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతో పాటు మెదడుకూ చేటు చేస్తుంది కొవ్వుల్లో డాల్లా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి, బటర్, క్రీమ్ కూడా పరిమితంగా వాడాలి.
👉ముఖ్యంగా ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్థబ్దంగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరుపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. ఈ ఆహార పదర్దాలు ,ఇంకా జాగ్రత్త లు తీసుకోవడం వల్ల మెదడు ని చురుకుగా వుంచుకోవచ్చు. ఇంకా పజిల్స్ పూర్తి చెయ్యడం ,మెదడును చురుకుగా ఉంచే ఆటలు ఆడటం కూడా చాలా తప్పనిసరి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.