పైలెట్ కంట్రోల్ లేకుండా..ఆ విమానం 40 నిముషాలు గాలి లో…

Spread the love

కానిబెర్రా లో ఒక విమానం కొంత సేపు భయాందోళనలకి గురి చేసింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ట్రైనీ పైలట్‌ అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో విమానం ఎటువంటి కంట్రోల్‌ లేకుండానే ఆకాశంలో 40 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ ఎయిర్‌పోర్టు గగనతలంలో చోటుచేసుకుంది. ఘటనను తీవ్ర చర్యగా పరిగణిస్తూ ఆస్ట్రేలియన్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్‌బీ) ఓ నివేదిక విడుదల చేసింది. ఏటీఎస్‌బీ నివేదిక ప్రకారం.. ట్రైనీ పైలట్‌ ప్రయాణించే ముందు రాత్రి సరిపడినంతగా నిద్రపోలేదు. ఉదయం అల్పాహారం తినకుండా ఓ చాక్లెట్‌, శక్తినిచ్చే ఓ డ్రింక్‌ మాత్రమే తాగి విధులకు హాజరయ్యాడు. సౌత్‌ ఆస్ట్రేలియాలోని పోర్టు అగస్టా ఎయిర్‌పోర్టు నుంచి పారాఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునే నిమిత్తం సోలో నావిగేషన్‌ ఫ్లైట్‌ను తీశాడు. జలుబు, విశ్రాంతిలేమితో పైలట్‌ బాధపడుతున్నాడు. 5,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా తలనొప్పికి గురయ్యాడు. దీంతో విమానాన్ని ఆటోపైలట్‌లో పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. ఎటువంటి క్లియరెన్స్‌ సమ్మతి లేకుండానే విమానం అడిలైడ్‌ గగనతలంలోకి ప్రవేశించింది. ఏటీసీ సిబ్బంది పలుమార్లు ప్రయత్నించిన పైలట్‌ అందుబాటులోకి రాలేదు. దానికి సమీపంలోనే మరో విమానం ప్రయాణించింది. సదరు విమాన పైలట్‌ స్పృహలోకి వచ్చినట్లుగా ఏటీసీకి తెలిపాడు. దీంతో పైలట్‌ గమనంలోకి వచ్చి మరో విమానం సహాయంతో విమానాన్ని పారాఫీల్డ్‌ విమానాశ్రయాంలో ల్యాండ్‌ చేశాడు. భద్రతా చర్యలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టనున్నట్లు అడిలైడ్‌ విమాన శిక్షణ సంస్థ ఏటీఎస్‌బీకి తెలిపింది. నిద్రకు సంబంధించి విద్యార్థులకు తగు సూచనలు చేయనున్నట్లు పేర్కొంది. అదృష్టం విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసారు…

Advertisements

Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading