ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్తను వెలువ రించింది.కీలక వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్న ట్టుగా తెలిపింది. అన్ని రకాల కాల పరమితుల రుణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంసీఎల్ ఆర్‌ను 5 బీపీఎస్ పాయిం ట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రుణాలపై వార్షిక ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి 8.45 శాతానికి దిగి వచ్చింది. తాజా సవరణ ప్రకారం.. వార్షిక కాలపరిమితితో తీసుకునే రుణాలపై వ డ్డీరేటు 8.50శాతం నుంచి 8.45 శాతానికి దిగివచ్చింది. శుక్రవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. సవరిం చిన రేట్ల ప్రకారం ఒక నెల కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వ డ్డీరేటు 8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గింది. మూడు నెలల, ఆరు నెలల రుణ వడ్డీ రేటు వరుసగా 8.15 , 8.30 శాతానికి తగ్గాయి. రెండు, మూడు సంవత్సరాల రేట్లు 8.55 శాతం, 8.65 శాతానికి చేరాయి. 👉దీనికి అదనంగా ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు గృహరు ణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు బ్యాంకు పేర్కొంది. గత నెల కూడా ఎస్బీఐ వడ్డీరేటును 5 బేసిస్ పా యింట్లు తగ్గించిన విషయం విధితమే. దీనికి రూ. 30లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏప్రిల్‌లో జ రిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక సమీక్షలో కేంద్ర బ్యాంక్ కీలక వడ్డీరేట్లపై పావు శాతం కోత విధించిన విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. అయితే 👉పొదుపు ఖాతాల కు కూడా ; పొదుపు ఖాతాలకు ఇచ్చే వడ్డీరేటును కూడా బ్యాంకు కుదిం చింది. అంత కుముందు పొదుపు ఖాతాల్లో రూ. లక్ష కంటే ఎక్కువ జమ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తుండగా.. మే 1 నుంచి దాన్ని 3.25 శాతానికి తగ్గించింది. ఇది శుభ పరిణామం అంటున్నారు..ప్రజలు..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.