భారత్ పాకిస్థాన్ మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అన్నిరకాల సంబంధాలు తెగిపోయాయి. క్రీడా, సాంస్కృతిక విషయాల్లో ఇప్పటికే పూర్తిగా తెగదెంపులు అయిపోగా, వాణిజ్య సంబంధాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి, అయితే ఒక్క అంశంలో మాత్రం పాకిస్థాన్ వాణిజ్య పరంగా భారత్ మీద ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. 👉విషయంలో కి వెళ్తే పాకిస్థాన్ కు దిగుమతి చేసుకునే తేయాకు ఉత్పత్తుల్లో సింహభాగం భారత్ నుంచి దిగుమతి అవుతున్నవే కావడం విశేషం. 2019 సంవత్సరంలో పుల్వామా దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య అన్ని వాణిజ్య సంబంధాలు బలహీనమైపోయినప్పటిక టీ దిగుమతులు మాత్రం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 25 మిలియన్ కేజీల తేయాకు ఉత్పత్తులను భారత్ నుంచి దిగుమతి చేసుకోగా, గత సంవత్సరం కేవలం 15.83 మిలియన్ కేజీల తేయాకు పాకిస్థాన్ దిగుమతి చేసుకుంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ కు ఎగుమతి అయ్యే తేయాకులో 80 శాతం దక్షిణ భారత్‌కు చెందినది కాగా, మిగితా 20 శాతం అస్సాంకు చెందినది కావడం విశేషం.
ముఖ్యంగా గత సంవత్సరకాలంగా ఆఫ్రికాలో తేయాకు పంట ఉత్పత్తి భారీగా క్షీణించడంతో పాటు, కెన్యా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు తగ్గడంతో భారత్ తేయాకు ఉత్పత్తులకు ఈ సంవత్సరం మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో పాకిస్థాన్ సైతం భారత్ తేయాకు ఎగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇండియన్ టీ అసోసియేషన్ సెక్రటరీ సుజిత్ పాత్ర స్పందిస్తూ…పాకిస్థాన్ నుంచి రెగ్యులర్ గా పేమెంట్స్ అందుతాయని, అలాగే రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగితే భారత్ టీ ఉత్పత్తులు ఎగుమతుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విషయం లో పాకిస్తాన్ భారత్ పై ఆధార పడాలి..తప్పదు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.