ఔను..ఆ ఊరి నిండా దెయ్యాలే..

Spread the love

దెయ్యం ఆ పేరు వింటే భయపడేవారు 90శాతం కంటే ఎక్కువ మందే.కొందరైతే అసలు చీకటి చూస్తేనే భయపడతారు. వారు హర్రర్ సినిమా చూస్తే వాళ్ల సంగతి అంతే. అలాంటివారు ఈ గ్రామానికి వెళ్తే ఇంకా వాళ్ళ సంగతి చెప్పలేం. డౌటే. ఆ గ్రామం పేరు “కుల్‌ధార ”

👉విషయంలోకి వెళితే :

రాజస్థాన్‌లోని జైసల్మార్ జిల్లాలో కుల్‌ధార అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్లు మొండి గోడలతో ధీనావస్థలో కనిపిస్తాయి. చీకటి పడితే ఇక్కడ ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయం భయంగా చెబుతుంటారు.

🎃ఆ దెయ్యాల గ్రామం పై పరిశోధన :
వాస్తవ౦ తెలుసుకునేందుకు గౌరవ్ తివారీ అనే ఇండియన్ పరానార్మల్ సొసైటీ సభ్యుడు.. తన టీమ్‌తో కలిసి రాత్రివేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు ఉన్నాయని నిర్ధారించారు. అప్పటి నుంచి కుల్‌ధారకు ‘దెయ్యాల’ గ్రామంగా ఈ ప్రాంతానికి మరింత ప్రచారం లభించింది.🎃13వ శతాబ్దం నుంచి మనుగడలో ఉన్న ఈ గ్రామంలో సుమారు 1588 మంది నివసించేవారు. ఓ రోజు ఏమైందో ఏమో.. తెల్లవారేసరికి ఊరంతా ఖాళీ. నిత్యం సందడిగా కనిపించే ఆ ఊరిలో గాలి హోరు తప్ప మరే అలికిడి లేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఏవరూ నివసించే సాహసం చేయడం లేదు. ప్రస్తుతం మొండి గోడలు… పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. అక్కడ ఒక్క రాత్రి గడిపితే చాలు.. ‘కాంచన’.. కనిపించేస్తుంది అంట..

🎃ఆ ఊరే ఒక మిస్టరీ :
ప్రస్తుతం పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతంలో పగటి వేళల్లో మాత్రమే తిరగాలి. సూర్యాస్తమయం కాగానే నిశబ్దం నెలకొంటుంది. ఆ సమయంలో పర్యటకులకు అనుమతి ఉండదు. ఈ గ్రామం ఎందుకిలా మారిందనే ప్రశ్నకు స్థానికులు భిన్న కారణాలు చెబుతున్నారు. ‘సలీం సింగ్’ అనే మంత్రి వల్ల ఆ గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని, అతడి వల్లే ఊరంతా ఖాళీ అయ్యిందని తెలుపుతున్నారు.

🎃స్థానికుల కథనం ఇది :దాని ప్రకారం.. జైశల్మార్‌ ప్రాంతం సలీమ్ సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేది. అతడు కుల్దారా గ్రామంలో ఓ బాలికను ఇష్టపడ్డాడు. ఎలాగైన ఆమె తనకు సొంతం కావాలని, లేకుంటే గ్రామాన్ని స్మశానం చేస్తానని హెచ్చరించాడు. దీంతో గ్రామస్థులు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు చేరుస్తామని చెప్పి, రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, బ్రిటీష్ వారి కాలంలో ఇక్కడ కరవు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజల వలసపోయారని మరికొందరు చెబుతారు. కానీ, ఈ గ్రామానికి సమీపంలో ఉన్న నీటి కొలను ఎప్పుడూ నీటితో నిండి ఉండటాన్ని చూస్తుంటే.. అది ఎంత వరకు నిజమనే అనుమానాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రామానికి ఏర్పడిన పరిస్థితి ఇప్పటికీ మిస్టరీనే.

🎃దెయ్యాలను పక్కన పెడితే.. పర్యటకపరంగా ఈ ప్రాంతం తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అప్పటి ఇళ్ల నిర్మాణ శైలి, చెక్కు చెదరని ఆలయాలు, మొండి గోడలు మధ్య ఫొటోలు దిగేందుకు పర్యటకులు ఇష్టపడతారు. జైపూర్ నుంచి 587 కిమీల దూరంలో ఈ ప్రాంతం ఉంది. చూడాలనుకున్న వారు వెళ్లి సరదాగా సెల్ఫీలు దిగిరండి బ్రతికుంటే !!


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading