కేవలం 27 మంది జనాభా గల అతి చిన్న దేశం అది..

Spread the love

నిజంగానే తక్కువ జనాభా కలిగిన అతి చిన్న దేశం అది. ఆ దేశం పేరు “సీ ల్యాండ్ “…ఆ దేశం మొత్తం
జనాభా కేవలం 27 మంది మాత్రమే . అవును ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలనే చిన్న దేశాలుగా పిలుస్తారు. అయితే వాటికి పూర్తి స్థాయి దేశాలుగా గుర్తింపు లేకపోయినప్పటికీ, ఆయా ప్రాంతాలకు మైక్రో నేషన్ హోదా ఇస్తుంటారు. కాబట్టి వాటి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వాటిని దేశాలుగానే పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశాలను మైక్రో నేషన్స్ అంటారు. ఇటువంటి బుల్లి దేశాలు ఇంగ్లాండ్ సముద్ర తీర ప్రాంతంలో కనిపిస్తుంటాయి. సీల్యాండ్ అనే దేశంలో ప్రస్తుతం 27 మంది జనాభా మాత్రమే. ఇది ఇంగ్లాండ్‌లోని సముద్రం మధ్యలో ఉన్నది.

👉ఈ దేశ చరిత్ర : రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సముద్రంపై తేలియాడే కృత్రిమ ద్వీపాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇది తూర్పు బ్రిటన్‌కు 7 మైళ్ల దూరంలో ఉన్నది. సీల్యాండ్ దేశం ఇంగ్లాండ్‌లోని ఓ సముద్రం మధ్యలో ఏర్పాటు చేసిన టవర్లపై ఉన్నది. దీనిపై మొదట్లో జర్మనీకి చెందిన ఆక్రమణదారులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ టవర్లను గతంలో రఫ్ టవర్ అనేవారు. ఆర్మీ జవాన్లకు చెందిన ఫోర్టుల ఆకారంలో వీటిని నిర్మించారు. ఫ్రెడ్డీ రాయ్ బేట్స్ అప్పట్లో బ్రిటిష్ ఆర్మీలో మేజర్‌గా పని చేసేవాడు. మొదట ఆయనే ఈ టవర్లను గుర్తించి నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆర్మీలో పనిచేసిన అనుభవంతో ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి పాప్ మ్యూజిక్‌ను కూడా అందించేవాడు. 1967 కంటే ముందు సీల్యాండ్ దేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం బేట్స్ ఎంతోకాలం పోరాడాడు. అనంతరం అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ దేశానికి 1967 సెప్టెంబర్‌లో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభించాయి. ఆ తర్వాత మేజర్ ఫ్రెడ్డీరాయ్ బేట్స్ అక్కడికి తన భార్య జోన్, కుమారుడు మైఖేల్, కుమార్తె పెన్‌లోప్‌లతో వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సీల్యాండ్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన రోజే బేట్స్ భార్య జోన్ పుట్టిన రోజు కూడా కావడంతో అదే రోజున ఆ దేశానికి ఓ జెండాను రూపొందించాడు బేట్స్.

అప్పట్లో చాలాసార్లు ఈ టవర్‌ను ధ్వంసం చేయాలని చూసింది అక్కడి ప్రభుత్వం. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న వారంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఫలితంగా సీల్యాండ్ దేమైక్రో నేషన్ హోదా దక్కింది. అదే ఇప్పుడు దాదాపు ఓ దేశంతో సమానం అయింది. అందుకే ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న దేశంగా గుర్తింపు పొందింది సీల్యాండ్ దేశం. 👉1975లో సీల్యాండ్ దేశానికి రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతం, కరెన్సీ, పాస్ పోర్ట్ కూడా వచ్చాయి. వీటన్నిటినీ తీసుకు రావడానికి ఫ్రెడ్డీరాయ్ బేట్స్ ఎంతో శ్రమించాడు. ఆయన కుమారుడు మైఖేల్ బేట్స్ ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్నాడు. సీల్యాండ్ దేశం గురించి, తన తండ్రి ఫ్రెడ్డీరాయ్ బేట్స్ చేసిన కృషిని గురించి మైఖేల్ బేట్స్ హోల్డింగ్ ద ఫోర్ట్ పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఈ దేశం యొక్క మరో విశేషం.

🔸ప్రత్యేకమైన నాణేలు, పోస్టల్ స్టాంపులు : ఈ దేశానికి ప్రత్యేకంగా నాణేలు, పోస్టల్ స్టాంపులు కూడా చలామణిలో ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో చలామణి అవుతున్న డాలర్లనే కరెన్సీగా ఇక్కడ కూడా వాడుతున్నారు. 1972 నుంచి సీల్యాండ్ దేశానికి నాణేలు అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం బంగారు, వెండి, ఇత్తడి వంటి లోహాలతో రూపొందించిన కాయిన్లు వాడుకలో ఉన్నాయి. అయితే ఇవి సీల్యాండ్ దేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మరొక చోట ఇవి చెల్లవు. ఈ నాణేలను కేవలం తమ దేశం కోసమే ప్రత్యేకంగా ముద్రించుకొని వినియోగిస్తున్నారు. అంతేకాదు 1969, 1970లలోనే సీల్యాండ్‌కు స్టాంపులను కూడా ప్రవేశపెట్టారు. …


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading