స్మార్ట్ ఫ్యాన్..వచ్చేసింది..ఇది మీరు తిరగమంటే తిరుగుతుంది…ఆగమంటే ఆగుతుంది..

Spread the love

స్మార్ట్ ఫోన్ కాదండి, ఇది స్మార్ట్ ఫ్యాన్..ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల ఫ్యాన్స్ వచ్చేశాయి. ఇది ఇంకొకటి . ఈ నేపద్యం లోనే మరో స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

👉👉ఈ ఫ్యాన్ ప్రత్యేకత : ఈ ఫ్యాన్ పిలిస్తే ఆన్ అవుతుంది.. ఆగిపో.. అంటే ఆగిపోతుంది.

👉ఇలా పని చేస్తుంది : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సపోర్ట్‌తో ఓరియంట్ ఎయిరోస్లిమ్ ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ ఆపరేట్ చేసేందుకు స్విచెస్ అవసరం లేదు. పిలిస్తేచాలు ఆన్ అవుతుంది.. ఆగిపో అని చెప్పగానే ఆఫ్ అయిపోతుంది. దీనికి కారణం ఇందులోని అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లే. వీటిని ప్రత్యేక యాప్‌తో వాడుకోవచ్చు. అయితే ఆన్ ఆఫ్ మాత్రమే కాదు.. ఏ టైమ్‌లో ఆన్ కావాలి. ఎంత తిరగాలి వంటి వాటిని కూడా టైమర్‌తో సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు… 🔸ఈ ఫ్యాన్‌కి లైట్ 💡కూడా ఉంటుంది.
👉కరెంట్ ని ఆదా చేస్తుంది : .ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా ఫ్యాన్ ఎక్కువ కరెంట్ వినియోగిచుకుంటుందంటే పొరపాటే.. ఇన్వర్టర్ మోటర్‌తో అతి తక్కువ విద్యుత్‌తో ఈ ఫ్యాన్ నడుస్తుంది. దీంతో కరెంట్ ఆదా అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. 👉 మార్కెట్లో ఈ ఫ్యాన్ ధర రూ.31,990. కొనుక్కునే వాళ్లకు సౌకర్యం కన్నా బద్ధకం మాత్రం పెరిగిపోతుంది…


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading