Apply Voter ID Online : మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసా?

voter id
Spread the love

Apply  Online : మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Apply Voter ID Online : భారత పౌరుడిగా ఓటు వేయడం ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే.. ఓటు వేయడానికి ఓటర్ ID తప్పనిసరి. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటరు ID కార్డ్ (How to Apply for Voter ID Card Online) కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

 

How to Apply Voter ID Online : ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? అయితే, ఇప్పడే అప్లయ్ చేసుకోండి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఎన్నికల్లో (Elections Schedule 2024) ఓటు వేయగలరని గుర్తుంచుకోండి. ఓటు నమోదు చేసుకున్న ప్రతి భారతీయ ఓటరు భారత ఎన్నికల సంఘం (election commission of india) నుంచి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (How to Apply Voter ID Online)ను అందుకుంటారు.

ప్రతి ఓటరు వారి ఓటర్ ID కార్డ్‌తో పాటు EPIC నంబర్ లేదా ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నంబర్‌ను పొందవచ్చు. EPIC నంబర్, అక్షరాలు, అంకెలు రెండింటితో రూపొందించిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్, ఓటరు గుర్తింపు కార్డు ముందుభాగంలో కనిపిస్తాయి. మునిసిపల్, స్టేట్, ఫెడరల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ ఓటర్ ఐడీ కార్డు చాలా అవసరం. ఎందుకంటే.. ప్రతి ఓటరు వ్యక్తిగత గుర్తింపుగా పనిచేస్తుంది.

 

కొత్త ఓటర్ ఐడీ కార్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

కొత్త ఓటరు ఐడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా.. ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల సంఘం (ECI) అధికారిక వెబ్‌సైట్ (eci.gov.in) హోంపేజీని విజిట్ చేయండి. భారత్‌లో ఎన్నికల ప్రక్రియ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతిది అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది

https://ceotelangana.nic.in/Forms.html  

 

 

మీ వివరాలు నింపే క్రమంలో కొన్ని పత్రాలు జత చేయాల్సి ఉంటుంది..

1. పాస్​పోర్ట్​ సైజ్ ఫొటో

2.డేట్​ ఆఫ్​ బర్త్​ ఫ్రూఫ్​ కోసం మీ ఆధార్​ కార్డు

3.రెసిడెన్స్​ ఫ్రూఫ్​ కోసం మీ తండ్రి/భర్త ఆధార్​ కార్డు

Ration card Application Status in Telangana : రేషన్ కార్డు జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తు అలా..

ఈ వివరాలన్నీ ఇచ్చాక.. ఓసారి PREVIEW చెక్​ చేసుకోండి.

అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Preview and Submitపై క్లిక్​ చేస్తే సరి.

మీ అప్లికేషన్ సక్సెస్​ఫుల్​ అని స్క్రీన్​పై చూపిస్తుంది. దాంతోపాటు Reference Number జనరేట్ అవుతుంది.

ఈ Reference Numberను జాగ్రత్తగా పెట్టుకోండి.

తర్వాత మీ అప్లికేషన్​ స్టేటస్​ను చూసుకునేందుకు ఈ నెంబర్​ కీలకం.

చివరగా ఓ వారం తర్వాత చెక్​ చేసుకుంటే.. మీ కొత్త ఓటర్​ ఐడీ కార్డు మీ కళ్ల ముందు కనిపిస్తుంది.

అన్నట్లు చెప్పడం మరిచితిని.. మీ కొత్త ఓటర్​ ఐడీ అప్లికేషన్​ కోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో.. చూశారుగా.. ఇంట్లోనే కూర్చుని రూపాయి ఖర్చు లేకుండా.. 10 నిమిషాల్లో ఓటర్​ ఐడీకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకోండి.

voter card

voter card

 

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading