సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే. ఇప్పటివరకు మనం లగటిపాటి సర్వే రిపోర్ట్ చూశాము. కానీ ఇప్పుడు అతని స్వంత బ్రదర్ సర్వే రిపోర్ట్ ఆసక్తి రేపుతోంది. తాజా ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలు ఖాయంగా వస్తాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు గరిష్ఠంగా 72 సీట్లకు మించి రావని తేల్చేశారు. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు మేజిక్ ఫిగర్ అన్న విషయం తెలిసిందే. లగడపాటి అంచనాలకు భిన్నంగా ఆయన సొంత సోదరుడు చెబుతున్న సర్వే రిపోర్ట్ విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ల్యాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన లగడపాటి మధుసూదన్ తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏ తీరులో ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పారు. జిల్లాల వారీగా ఆయన వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఆయన అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ కు 106 స్థానాలు పక్కాగా వస్తాయని.. టీడీపీ 68 సీట్లు.. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వస్తుందని ఆయన చెబుతున్నారు.
ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. మధుసూదన్ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకు వచ్చే వీలుందని.. బాబుకు నాలుగు నుంచి ఆరు వరకు అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి లగటిపాటి సర్వే రిపోర్ట్ కు బాగానే కౌంటర్లు పడుతున్నాయి. అయితే ఈ సారి కూడా లగటిపాటి సర్వే మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కువ మంది కామెంట్ చేయడం గమన్హారం.