ఇకపై మన కిలో లెక్క మారనుందా..!!?

Spread the love

ప్రపంచ తీర్మానాలకు అనుగుణంగా అంతర్జాతీయ కొలమానాల విధానంలోని ఏడు ప్రాథమిక యూనిట్లలోని కిలో, యాంపియర్‌(విద్యుత్తు యూనిట్‌), కెల్విన్‌(వేడి), మోల్‌(అణువుల సంఖ్య)లను సోమవారం నవీకరించారు. ♦ఇప్పటివరకు పారిస్‌ నగరానికి సమీపంలోని సెవరెస్‌ ప్రాంతంలోని భూగర్భంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడు జాడీల కింద అరచేతి పరిమాణంలో ఉన్న కిలో రాయిని ప్రమాణంగా తీసుకునేవారు.
👉‘లీ గ్రాండ్‌ కే’: ఇది మన కిలో రాయి కి ప్రమాణికంగా వాడే మరొక రాయి పేరు.
👉40 ఏళ్లకు ఒకసారి వివిధ దేశాలకు చెందిన అధికారులు తమ దగ్గర ఉన్న కిలో రాయిని ఫ్రాన్స్‌లోని సెవరె్‌సకు తీసుకెళ్లి.. దాని బరువుతో సరిచూసుకునేవారు. దేశవ్యాప్తంగా దాన్నే ప్రమాణంగా తీసుకునేవారు. ఇప్పుడీ ప్రమాణాన్ని మార్చేశారు. 👉 ‘లీ గ్రాండ్‌ కే’కు బదులు కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చారు. అయితే.. ♦ఈ నిర్ణయంతో వీటన్నిటినీ తూచే నమూనా రాయి మాత్రమే మారింది కానీ కిలో రాళ్లు ఏమీ మారవు. .అదండీ విషయం…


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading