పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ లోనారాయణ మూర్తి చిరంజీవితో తన మొదటి పరిచయం గురించి తన జ్ఞాపకాలను ఒకసారి నెమరువేసుకున్నారు.
🏵 గత జ్ఞాపకాలు :నేను 1976లో బీఏ చదివి మద్రాస్ వెళ్లా. చిరంజీవి కూడా అదే సమయంలో మద్రాస్ వచ్చారు. ఆయన ఇనిస్టిట్యూట్స్‌కు వెళ్లి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నేను చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ సినిమాల్లో ఎంట్రీ అయ్యా. అలాంటి దశలో ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో చిరంజీవి హీరో, నేను జూనియర్ ఆర్టిస్టు వేషం వేశా. అప్పుడు చిరంజీవి బీకామ్, కాలేజీలో స్టూడెంట్ లీడర్, అలానే నేనూ కాలేజీ ఫైనాన్స్ సెక్రటరీని. సినిమా షూటింగ్ కోసం చిరంజీవి, నూతన్ ప్రసాద్, చంద్రమోహన్‌ని రాజమండ్రి అప్సర లాడ్జిలో ఉంచారు. నన్ను కూడా లాడ్జిలో ఉంచుతారు. బ్రహ్మాండమైన భోజనం పెడతారు అని అనుకున్నా. కానీ నన్ను వంటపాకలో ఉంచారు.
అప్పుడు దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి నాకు కంపెనీ ఇచ్చారు. ఓ “యంగ్ మెన్ “చెవిలో వాక్‌మేన్ పెట్టుకుని షాట్‌లోకి వచ్చారు. ఎవరని చూస్తే చిరంజీవి. ఆ సమయంలోనే చిరంజీవి ఇండస్ట్రీని రూల్ చేస్తాడని ఆయనతో ఆరోజే చెప్పా.”అని చెప్పారు. ఖైదీ నుంచి ఇప్పటివరకు తానే మెగాస్టార్‌గానే ఉన్నారని భారతదేశంలో ప్రాంతీయ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు 👉ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘ఇంతవరకూ నా సినిమా ఆడియో ఫంక్షన్ లైవ్ ఎప్పుడూ లేదు. ఇది తొలిసారి. మెగాస్టార్ చిరంజీవి రావడం వల్లే ఇలా జరిగింది. చిరంజీవిని కలిసి సార్ మీరు నా సినిమా ఆడియో ఫంక్షన్‌కు రావాలని కోరా. మీ చేతుల మీద ఆడియో రిలీజ్ చేస్తే నా సినిమాకు ప్రమోషన్ హెల్ప్ అవుతుంది సార్ అని అన్నా. నారాయణ నేను వస్తున్నా అని చిరంజీవి అన్నారు.చిరంజీవి నా ఆడియో ఫంక్షన్ కి రావడం నా అదృష్టం.’’అని , సాటి హీరోపై చిరంజీవికి ఉన్న అభిమానానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా అని అన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.