#ఊరుమెచ్చిన_ఆణిముత్యం…
#చదువుకున్నాజిల్లాకేకలెక్టర్గా*..
పేదింటి కష్టాలను అధిగమించి విజేతగా నిలిచిన #కలెక్టర్రేవుముత్యాలరాజు ఒక నిబద్ధత ఉన్న అధికారిగా మనకు కనిపిస్తారు . గంభీరంగా కనిపించే ఆయన సామాన్య కుటుంబం మంచి వచ్చి ఎదిగి ఇసాధారణ వ్యక్తిగా మారారు . ఆయన కుటుంబ నేపథ్యం . వ్యక్తిగత జీతం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ .
సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది . ఆయన ఆంతరంగం గురించి తెలుసుకుంటే చైతన్యం రగులుతుంది . పట్టుదలతో చదివిన తీరు గమనిస్తే యువతకు మార్గదర్శకంగా ఉంటుంది . మరి ఆయన వ్యక్తిగతం ‘ ‘ అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే . . తోకాల మరుగున దాగి సుఖమున్నదిలే . . ‘ అన్న ఓ సినీ గేయ రచయిత పాటకు నిలువెత్తు రూపంగా నిలిచారాయన . #గొడ్డుకారంతో ఆకలి తీర్చుకునే కడు పేదరిక కుటుంబంలో పుట్టిన ఆయన . . విజయాలకు మారుపేరుగా నిలిచారు . పాల కడలిని చిలికి అమృతం తీసినట్లే . . కష్టాలనే కడలిని లక్ష్యమనే కవ్వంతో చిలికి ఐఏఎస్ అనే అమృతాన్ని | సాధించుకున్నారు . కుటుంబ ఆర్థిక పరిస్థితులు , చెల్లెలు మృతి కొద్దిగా కుంగదీసినా . . అంతలోనే #ధీరుడై నిలిచి లక్ష్యసాధన దిశగా నడిచారు . పాఠశాల మొదటి స్థానంతో మొదలైన ఆయన విజయాల ప్రస్థానం దేశస్థాయిలో ఐఏఎస్ #అగ్రగణ్యుడిగా నిలిచే వరకు – అలుపెరగని విధంగా సాగింది .ఆయన వేసిన ప్రతి అడుగు యువతకు ఆదర్శమే .
మాది కృష్ణాజిల్లాలో మారుమూల గ్రామం . కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం . చుట్టూ సముద్రం నీరు . మధ్యలో మా ఊరు . అంటే ఒక దీవి . గ్రామంలోనే ప్రాథమికోన్నత . పాఠశాల ఉంది . ప్రతిరోజూ నాలుగు కి . మీలు నడిచి వెళ్లి రావాలి . మా ఊళ్లో చదువుకునే వారు చాలా తక్కువ . పదో తరగతిలో 30 నుంచి 35 మంది పరీక్షకు వెళ్తే . . అందులో ఒకరో , ఇద్దరో ఉత్తీర్ణులయ్యేవాళ్లు . ఎందుకంటే ఓవి కావటంతో ఉపాధ్యాయులు రావటానికి ఇష్టపడరు . అందుకు తగ్గట్లే చదువులు ఉంటాయి . నేనేమీ తెలివైన విద్యార్థిని కాను . ఎనిమిదో తరగతి వరకు ఏదో పాఠశాలకు వెళ్లాను . . వచ్చాను అన్నట్టు ఉండేది . నాన్న నరసింహయ్య . తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లేవారు . రాత్రికి ఇంటికి | వచ్చేవారు . ఇంటి దగ్గర అమ్మ చింతామణి ఉండేవారు . మాది చాలా నిరుపేదకుటుంబం . పూరిల్లు , అమ్మానాన్నది అంతంత మాత్రం చదువులే . నాన్న ఎనిమిదో తరగతి . . అమ్మ ఆరో తరగతి వరకే చదివారు . కనీసం నన్ను చదివించటానికి వారికి సాధ్యమయ్యేది కాదు . అమ్మ ఒక్కటే చెప్పేది . ఒక పాఠ్యాంశం తీసి . . మొత్తం చూచి రాయమనేది . అదే నాకు ఎంతో మేలు చేసింది . చదవటం కన్నా . . రాయడంతో అవగాహన ఎక్కువ వచ్చేది.svp
#చెల్లిచివరిచూపు_దక్కలేదు .
నాకు ఇద్దరు అన్నలు , ఒక చెల్లెలు ఉన్నారు . అన్నలు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు . మా ముగ్గురికీ చెల్లెలు ధనలక్ష్మి అంటే ఎంతో ప్రేమ . నేను పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ( 1995లో ) చదివే సమయంలో అంతర్గత మూల్యాంకన పరీక్షలు జరుగుతున్నాయి . ధనలక్ష్మి చినగొల్లపాలెంలోని పాఠశాలలో చదువుతోంది . ఒక రోజు పాఠశాలకు వెళ్తూ మధ్యలో స్పృహ కోల్పోయింది . వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లటానికి రోడ్డు మార్గం లేక పడవలో బయలుదేరారు . దాదాపు 16 కి . మీలు వెళ్లాలి . సగం దూరం వెళ్లేప్పటికి చనిపోయింది . అదే రోడ్డు మార్గం ఉంటే తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్తే దక్కే అవకాశం ఉండేది . చెల్లి చనిపోయిన విషయం నాకు తెలియదు . పరీక్షలు జరుగుతున్నాయని నాన్న నాకు తెలియనీయలేదు . పరీక్షలు పూర్తయ్యాక నాన్నతో ఊరికెళ్లిన నేను పడవ దిగుతున్న సమయంలో పరిచయమున్న ముసలావిడ . . ఏరా . . . చెల్లెలు చనిపోతే ఇప్పుడు వస్తున్నావా ? అంటూ అడిగింది . నాకు ఏం అర్థం కాలేదు . అప్పుడు జరిగిన విషయం మొత్తం నాన్న చెప్పారు . కళ్లవెంట నీరు ఆగలేదు . ఏడ్చేశాను . . దీనిప్రభావం రెండేళ్లు నా చదువుపై పడింది . అదే సమయంలో కలెక్టర్ కావాలన్న బలమైన కోరిక పుట్టింది . అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది . చెల్లెలు చనిపోకుంటే కలెక్టర్ అయ్యేవాడిని కాదేమో ? నేను ఐఏఎస్ అయిన తర్వాత చిన్నగొలపాలెంలో చైతన్యం వచ్చింది . ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వాళ్లు చాలా మంది ఉన్నారు . అది కూడా నాకు ఒకింత గర్వంగా అనిపిస్తుంది .
#నాన్నకష్టంఐఎఎస్_లక్ష్యం
నాన్న నరసింహయ్యరు నలుగురు సోదరులు . . ముగ్గురు అక్కలు . ఇంటికి పెద్దవారు కావటంతో కుటుంబ భారం మొత్తం ఆయనపైనే . నాన్న , బాబాయి కలిసి కష్టపడ్డారు . స్వార్థం చూసుకోలేదు . మిగిలిన ఇద్దరు సోదరులను కనీసం చదివించాలన్న తపనతో ఇద్దరూ వ్యవసాయ పనులు చేశారు . ఒక బాబాయి జీసీ సంక్షేమశాఖలో వార్డెన్ . మరో బాబాయి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు . బాబాయి విస్సయ్య నన్ను తొమ్మిదో తరగతి నుంచి తాను పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు . గుండుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చారు . అదే నా జీవితం మలుపు తిరగటానికి దోహదపడింది . నేను ఇంగ్లీషు , లెక్కల్లో చాలా వెనుకబడ్డాను ఏం చేయాలి ? ఇదే అలోచన . రెండింటిపేనే దృష్టి పెట్టాను . వాటిపై ఎక్కువ సాధన చేశాను . పదో తరగతి వచ్చే సరికి లెక్కల్లో మంచి పట్టు వచ్చింది.svp1995లో పదో తరగతిలో నేను పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి మొదట నిలిచాను . అక్కడ నుంచి పాలిటెక్నిక్ , బీటెక్ లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించి ఎంటెక్ పూర్తిచేసి రైల్వేలో 2004లో ఉద్యోగంవచ్చింది . అక్కడ శిక్షణలో ఉంటూనే 2004లో సివిల్స్ పరీక్షలు రాశాను . ప్రిలిమ్స్ , మెయిన్స్లో తక్కువ మార్కులతో అర్హత సాధించినా . . ముఖాముథలో ఇబ్బంది పడాల్సి వచ్చింది . 2005లో మళ్లీ సివిల్స్ పరీక్షలకు హాజరయ్యారు . గతంలో లోపాలను గుర్తింది సరిచేసుకుని ప్రిలిమ్స్ , మెయిన్స్లో మంచి మార్కులు వచ్చాయి . ముఖములో మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడింది . దాంతో రాజస్థాన్ రాష్ట్ర ఐపీఎస్ అధికారిగా ఉద్యోగం వచ్చింది . ఎలాగూ ఐపీఎస్ వచ్చింది . అక్కడ శిక్షణ కోసం వెళ్లాలి . రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశాను . ఐపీఎస్ శిక్షణలో ఉన్న సమయంలో ముఖాముఖిలో మెలకువలు సహచరుల ద్వారా తెలుసుకుని 2006లో జరిగిన సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించామ . ఇలా 14 మే , 2007న ఐఏఎస్ సాధించాను . పదేళ్లు అప్పుడే గడిచిపోయింది .
#అమ్మ_ఏడ్చేసింది :
నేను జాతీయ స్థాయిలో ఐఏఎస్గా ఎంపికైన తర్వాత అప్పటి సీఎం #YSరాజశేఖరరెడ్డి నుంచి పిలుపు వచ్చారు . ఆయన్ను కలవటానికి వెళ్లాను . అక్కడకు అమ్మ కూడా వచ్చారు . నేను పోలీసు దుస్తుల్లో ఉన్నాను . గతంలో పోలీసు దుస్తుల్లో అమ్మ నన్ను ఎప్పుడూ చూడలేదు . ఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేదు . మా అబ్బాయి ఎక్కడ ? అంటూ అడుగుతూ ఉన్నారు . ఒక్కసారి నన్ను చూసిన వెంటనే ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు . ఇప్పటికీ నాకు ఆ క్షణాలు అలాగే గుర్తుండిపోయాయి .Svp వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను పిలిచి #ఏంకావాలి అని అడిగితే . . మారు మాట్లాడకుండా చినగొల్లపాలెం నుంచి మండలానికి వెళ్లటానికి #వంతెనకావాలని అడిగాను . #అక్కడికక్కడేవంతెనమంజూరు చేశారు . రూ . 26 కోట్లతో దాన్ని కట్టారు . అప్పుడే మకు రోడ్డు మార్గం ఏర్పడింది . ఇలా అడగటం వెనుక ఒక కారణమే ఉంది .
#ఇంటినుంచేమొదలుకావాలి :
కన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే సంబంధం కోసం చూసి విశ్రాంత ఐఏఎస్ అధికారి మధుసూదనరావు కుమార్తె సిందూరను భాగస్వామిగా ఎంచుకున్నాను . ఒక కొడుకు . వాడిపేరు పక్ష . పేరు పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన అంశమే ఉంది . నా పేరులో ‘ ముత్యాలు ఉన్నాయి . అందుకే వాడి పేరులో ‘ వజ్రాలు వచ్చేలా పేరు ఎంపిక చేశామని నవ్వుతూ . ఆంజనేయస్వామి పేరు వస్తుందని వజ్రాక్ట్ పేరును ఎంపిక చేశాం .
#యువతకుఇచ్చేసందేశం : svp
ప్రతి ఒక్కరిలో లక్ష్యం ఉండాలి . దాన్ని సాధించుకునే తపన ఉండాలి . ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు పట్టుదలతో ఉన్నతంగా ఎదిగితే . . మిగిలిన వారిని వాళ్లే నడిపిస్తారు . ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న తపనతో చదవాలి . ఒకే ఆంశం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా అదనంగా వచ్చే సమాచారం ఉండదు . ఆందుకే మన ఎంపికలో ప్రత్యేకత చూపాలి . మనకు వచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి . నేను ప్రస్తుతం ఇంత స్థాయికి చేరడానికి అందరి దీవెనలే కారణమై ఉండొచ్చు . విలువలు ఎంతో గొప్పవి : నాకు పురాణాలు , ఇతిహాసాలు చదపటం అలవాటు . ఇప్పటికీ చదువుతూనే ఉంటాను . కథల ద్వారా మనకు విలువలు బోధపడతాయి . అంతెందుకు మనం చిన్నతనంలో చదువుకున్న ఆవు – పులి కథ తెలియని వారు ఉంటారా ? నిజాయతీ గురించి కథ మనకు తెలుపుతుంది . మనల్ని సంస్కరించుకునే అంశాలు గ్రంథాల్లో ఉన్నాయి. అందుకే నేటికి నేను వాటిని చదువుతూ ఉంటాను.
ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.
https://teluguwonders.com
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.