మనిషి బతికుండగానే జీవచ్ఛవాన్ని చేసేసి నరకయాతన అనుభవించేలా చేసే వ్యాధి క్యాన్సర్. చిన్న,పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వెంటాడే మహమ్మారి క్యాన్సర్. అందుకే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం. అయితే క్యాన్సర్ వ్యాధి బాగా ముదిరిన తర్వాతే బయటపడుతుంది. ఈ లోగా గమనించుకోలేకపోతే భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుంది. అసలు ముందుగా ఈ వ్యాధి ని గుర్తించాలంటే మీ.శరీరంలో ఈ 10 లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.
1⃣నిత్యం అలసట:
నిత్యం అలసటగా అనిపించినట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. ఈ లక్షణాలు ఉండేవారిలో ఎక్కువగా లుకేమియా క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ లు ఏర్పడే ప్రమాదం ఉంది.
2⃣నిత్యం జ్వరం రావటం:
క్యాన్సర్ కారకాలు శరీరంలో మొదటగా రోగ నిరోధక శక్తిపై వాటి ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల నిత్యం జ్వరం వస్తుంది.
3⃣అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం:
అకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నట్లయితే అది క్యాన్సర్ కు సంకేతంగా భావించి తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
4⃣అజీర్ణ సమస్య:
ఆహారాన్ని మింగడం లేదా అజీర్ణ సమస్యలు ఏర్పడితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నవారికి కడుపు, అన్నవాహిక క్యాన్సర్ లు ఏర్పడే ప్రమాదం ఉంది.
5⃣నిరంతర దగ్గు:
సాధారణంగా ఒకసారి దగ్గు వస్తే అంత సులభంగా తగ్గదు. కానీ, నిరంతరాయంగా దగ్గు వస్తూండి.. దానితో పాటు మీ చాతి, భుజాల వద్ద నొప్పులు వస్తున్నట్లయితే తప్పక అనుమానించాల్సింద.
6⃣నిరంతర నొప్పి:
ఏ కారణం లేకుండా నిరంతరం ఒకేచోట నొప్పి వస్తూ.. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా నొప్పి తగ్గకపోతుంటే.. క్యాన్సర్‌గా అనుమానించాలి. ఈ లక్షణాలు ఉండేవారిలో ఎక్కువగా పెద్ద ప్రేగు క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, పురీషనాళ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే ప్రమాదం ఉంది.
7⃣అసహజ వాపు:
మీ శరీరంలో ఎక్కడైనా నిష్కారణంగా గడ్డలు, వాపు కనిపిస్తున్నట్లయితే అనుమానించాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో అయితే రొమ్ముల వద్ద ఏర్పడే గడ్డలు రొమ్ము క్యాన్సర్‌ను సూచిస్తాయి.
8⃣. మూత్ర సమస్యలు:
సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే తప్పకుండా సందేహించాలి. పెద్ద ప్రేగు క్యాన్సర్‌కు గురయ్యేవారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మూత్రంలో రక్తం పడితే, లేదా నొప్పిగా అనిపిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణంగా భావించాలి.
9⃣ రక్తస్రావం:
దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం వస్తున్నట్లయితే ఇక డౌటే లేదు.. అది ఖచ్చితంగా క్యాన్సరే! అలాగే మర్మాంగాలు, పిరుదుల నుంచి రక్తం కారుతున్నా వైద్యులను సంప్రదించాలి.
🔟. చర్మంపై మార్పులు:
చర్మంపై వచ్చే మార్పులను చాలామంది గుర్తించరు. అయితే, అవి చర్మ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. చర్మం ఎర్రబడినా, చిన్న చిన్న మచ్చలు, పులిపిర్లు వంటివి వస్తున్నా తప్పకుండా వైద్యులను సంప్రదించండి.
🔴మీలో ఈ పైన తెలిపిన 10 లక్షణాలు కనిపిస్తే.. భవిష్యత్తులో మీరు క్యాన్సర్ కిగురి కాబోతున్నారని సంకేతాలుగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించండి.
👉 తెలుసుకున్నారు కదా! ఆ లక్షణాల్లో ఏ ఒక్కటి మీలో కనిపించినా ఇక ఏ మాత్రం ఆలసించకుండా వెంటనే అప్రమత్తం అవండి.