సాక్ష్యమే దొరకదు అనుకున్న ఓ కేసు ని మలుపు తిప్పిన రజినీకాంత్ . నెల్లూరు జిల్లాలో జరిగిన స్కూల్ టీచర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది. 🔴బంగారు కమ్మల కోసం దారుణ హత్య : ఒక వ్యక్తి ఒక స్కూల్ టీచర్ చెవులకు ఉన్న బంగారు కమ్మల కోసం. ఆమెను కత్తితో పొడిచి పొడిచి కిరాతకంగా చంపేశాడు.. . .. చంపేసిన తర్వాత చెవులను కోసి మరీ ఎత్తుకెళ్లాడు.
🔴హత్య చేసి ప్రమాదం గా చిత్రీకరణ: ఆ తర్వాత ఇంట్లోని గ్యాస్ లీక్ చేసి.. మంటలని అంటించి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ దారుణాన్ని పోలీసులు సైతం ప్రమాదంగా భావించారు.
🔴ఎందుకో అనుమానం వచ్చింది: కానీ పోలీసుల కు ఎందుకో అనుమానం వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన తీరు.. స్కూల్ టీచర్ శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించింది విచారణ చేపట్టారు.కానీ సరైన సాక్ష్యాలు దొరక లేదు. చేసింది ఎవరో తెలుసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్న పోలీసులకు రజనీ కాంత్ help చేసాడు.
🔴నేరస్తున్ని పట్టించిన రజినీకాంత్ ఫోటో :పోలీస్ లకు ఎందుకో ఓ ఆటోపై అనుమానం వచ్చింది. .. .
స్కూల్ టీచర్ హత్య తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఓ ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. దానికి నెంబర్ లేదు. ఆటోను రీ మోడల్ చేసినట్లు ఉంది. యజమాని ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు పోలీసులకు. అయితే ఆటో వెనక సూపర్ స్టార్ రజినీకాంత్ ఫొటో మాత్రం చాలా క్లారిటీగా, పెద్దదిగా ఉంది. ఆ ఫొటో ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
నెల్లూరు పట్టణంలోని అన్ని రోడ్లలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
రజినీకాంత్ ఫొటో ఉన్న ఆటో ఎక్కడెక్కడ.. ఏయే సమయాల్లో తిరిగింది అనే విషయాలు తెలుసుకున్నారు. రజినీకాంత్ బొమ్మ ఉన్న ఆటోలన్నింటినీ పట్టుకున్నారు. వాటిలో అనుమానం వచ్చిన శ్రీనివాస్ అనే డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో బుకాయించిన శ్రీనివాస్.. పోలీస్ స్టయిల్ లో విచారించగా హత్య తానే చెందినట్లు అసలు విషయం కక్కేశాడు.హంతకుడు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు..కానీ ఆటోపైనుండి సూపర్ స్టార్ రజినీకాంత్ అంతా (ఫొటో)చూస్తున్నాడని గమనించ లేదు. ఆటో పై రజిని కాంత్ ఫోటో లేకపోయి ఉంటే కేసు మిస్టరీ వీడటం కష్టంగా ఉండేదన్నారు పోలీసులు. మొత్తానికి ఓ హంతకుడిని రజనీకాంత్ పట్టించినట్లయ్యింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.