ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి,వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్, రావండాకు పంపించాలి.’ అంటూ ఓ పాకిస్తాన్ మంత్రి ధోని పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 👉టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ భక్తిపై ఇటీవల క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపించారు. వరల్డ్ కప్ లో కూడా ధోనీ తన దేశ భక్తిని చూపించాడంటూ ప్రశంసలు కురిపించారు. అయితే… పాకిస్థాన్ మంత్రి మాత్రం దానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే
🔴Dhoni హ్యాండ్ గ్లౌజ్ వివాదం : వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్ దక్షిణాఫ్రికాతో తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో ధోనీ చేతికి వేసుకున్న గ్లౌజ్ లకు బలిదాన్ బ్యాడ్జ్ సింబల్ ఉంది. ఫెలుక్‌వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అయితే ఈ లోగోతో ధోని తన దేశభక్తిని, ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని, భారత అభిమానులు ప్రశంసలు కురిపించారు.
🔴పాక్ మంత్రి అభ్యంతరం: దీనికి పాక్ మంత్రి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెడరల్ మంత్రి అయిన ఫవాద్ చౌదరి ట్విటర్ వేదికగా ధోని చర్యను, భారత్ మీడియాను తప్పుబట్టాడు.
‘ ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి,వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్, రావండాకు పంపించాలి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
🔴 ఐసీసీ సైతం బ్యాడ్జ్‌పై అభ్యంతరం: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సైతం బలిదాన్ బ్యాడ్జ్‌పై అభ్యంతరం తెలిపింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. 👉ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.