వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు అసలు ఇప్పటివరకు పాలనా అనుభవం లేని జగన్ ప్రభుత్వాన్ని పాలించగలరా అనుకున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు,కొంత మంది రాజకీయ నాయకులు కూడా.కానీ ఒక్కసారి వై ఎస్ ఆర్ సి పి విజయం సాధించి జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఇప్పుడు జగన్ తనపై ఉన్న భేదాభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నారు తన పక్కా ప్రణాళిక తో.
🔴లోటు బడ్జెట్ లోఉన్నా సరే : ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం నెరవేర్చాలని పంతం గా ఉన్నారు జగన్. దానికి తోడు ప్రభుత్వాన్ని నడపడంలో అనవసర వ్యయాలను తగ్గించాలని చూస్తున్నారు జగన్ దీనివల్ల ఆ వ్యయం తగ్గడంతో ప్రజలకు నిజంగా చేయవలసిన పనులను మరింతగా 100% చేయడానికి వీలవుతుంది అని జగన్ ఆలోచన .
🔴ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల రద్దు: దానిలో భాగంగానే ఇప్పటికే టీడీపీ హయాంలోని అన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి పారదర్శకంగా కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జగన్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ భేటిలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.
🔴విద్యార్థులకు అమ్మఒడి : జనవరి 26వ తేదీ నుండి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లలో చదివే విద్యార్థులు అమ్మఒడి పథకానికి అర్హులుగా కేబినెట్ నిర్ణయించింది.
🔴చెక్కుల పంపిణీ :ప్రతీ తల్లికి అదే రోజు రూ.15వేల చెక్కుల పంపిణీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
🔴జీతాల పెంపు : వివోఓలకు, ఆర్బీఏలకు రూ.3వేల నుండి రూ. 10 వేలకు వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
అలాగే మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతం రూ.18వేలకు పెంచారు. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ.400 నుంచి రూ.4వేలు. పొదుపు సంఘాల మహిళలకు సాయం చేసే రిసోర్స్ పర్సన్స్, యానిమేటర్లకు రూ.10వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.