రేషన్ ఇక సీదా ఇంటికి…

ration
Spread the love

రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అధిక మొత్తంలో పక్క దారి పట్టడం వంటి అక్రమాలు కొనసాగుతున్నాయని తెలిసిందే.అయితే తాజాగా ఈ అక్రమాలను అరికట్టేందుకు కొత్త ప్రభుత్వం సరికొత్త పద్ధతు లను అవలంభించనుంది.

🔴రేషన్‌ సరుకులు ఇక ప్యాకెట్ల రూపం లో : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని 50 కేజీల బస్తాల్లో రేషన్‌ షాపులకు సరఫరా చేస్తోంది.అక్కడ నుండి ప్రజలకు కావాల్సిన బియ్యాన్ని వారికి కావాల్సినట్టుగా ఐదు కేజీలు ,10 కేజీలు, 20 కేజీలు గా తూకం వేసి ఇచ్చే పద్ధతి ఉంది ఇప్పటివరకు . మిగిలిన సరుకులు కూడా చాలావరకు తూకం వేసే ఇస్తున్నారు.అయితే ఈ పద్ధతికి స్వస్తి చెప్పి పౌరసరఫరాలశాఖ సెప్టెంబర్‌ నుండి రేషన్‌ సరుకులన్నింటినీ ప్యాకెట్ల రూపం లోనే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లో చర్చించారు.

🔴కారణం ఏంటంటే :రేషన్‌ బియ్యం ఇతర సరుకులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 👉 రేషన్‌షాపు డీలర్లకు రేషన్‌ సరుకులను తూకం వేసే పనిని కూడా ఈ విధానంతో ప్రభుత్వం తగ్గించనుంది. రేషన్‌ సరుకులు అన్నింటినీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేందుకు కావాల్సిన వివరాలను పౌరసరఫరాల శాఖ నుండి సేకరించిన తరువాతసిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

🔴 రేషన్ కార్డ్ దారులు ఇంత మంది : రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ అన్న యోజన(ఎఎవై) కార్డులు 10 లక్షలు, లబ్ధిదారులు ఒక్కరే ఉన్న రేషన్‌ కార్డులు 23 లక్షలు, ఇద్దరు లబ్ధిదారులు ఉన్న కార్డులు 35 లక్షలు, ముగ్గురు ఉన్న కార్డులు 29 లక్షలు, నలుగురు ఉన్న కార్డులు 38 లక్షలు, ఐదుగురు అంతకన్నా ఎక్కువ ఉన్న కార్డులు 12 లక్షలు ఉన్నాయి.

🔴వాళ్లకు పంపిణీ ఇలా : రేషన్‌ బియ్యాన్ని 5, 10, 20 కేజీల ప్యాకెట్లలో తయారు చేసి పౌరసరఫరాలశాఖ పంపిణీ చేయనుంది. బియ్యం ప్యాకెట్లను సభ్యుల సంఖ్యను. ఆధారంగా చేసుకుని ఒక్కరు ఉన్న వారికి 5 కేజీల ప్యాకెట్టు, ఇద్దరు ఉన్న కార్డులకు 10కేజీల ప్యాకెట్టు, ముగ్గురు ఉంటే 10, 5 కేజీల ప్యాకెట్లు, నలుగురు ఉంటే 20కేజీల ప్యాకెట్టు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఇతర సరుకులన్నింటినీ ప్యాకెట్ల రూపంలోనే యంత్రాల ద్వారా తూకం వేసి, ప్యాకింగ్‌ చేసి ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయనుంది.అయితే ఈ విధానం అమలుపై ప్రభుత్వం నుండి మరింత స్పష్టత రావాల్సి ఉంది.

🔴బియ్యం ప్యాకెట్ల తయారీ కి రంగం సిద్ధం :
బియ్యం ప్యాకెట్ల తయారీకి ప్రభుత్వం అధునాతన యంత్రాలను కొనుగోలు చేయనుంది. ఈ యంత్రాలే బియ్యాన్ని 5, 10, 20 కేజీల ప్యాకెట్లకు తూకం వేసి ప్యాకింగ్‌ చేయనున్నాయి. ఈ విధానానికై 👉తూకం వేసే యంత్రానికి రూ.7.5 లక్షలు, 👉హెవీ డ్యూటీ స్లాట్‌ కన్వేయర్‌కు రూ.2 లక్షలు, 👉హెవీ డ్యూటీ బ్యాగులు కుట్టే యంత్రానికి 1.65లక్షలు, 👉సంచులు లోడ్‌, అన్‌లోడ్‌ చేసే చెక్కతో రూపొం దించిన కన్వేయర్‌కు రూ.4.25 లక్షలు, 👉ఆటోమేటిక్‌ కటింగ్‌ మెషిన్‌కు రూ.82,500, 👉లూబ్రికేషన్‌ పంపు రూ.6,500, 👉బియ్యాన్ని సంచుల్లో నింపే యంత్రానికి రూ.3 లక్షల చొప్పుున ఖర్చు చేయనుంది. ఇలా మొత్తం రూ.19.29 లక్షలతో ఒక పాయింట్‌ లో యంత్రాలను నెలకొల్పనుంది. యంత్రాలను నెలకొల్పడానికి, యంత్రాల రవాణా ఖర్చులన్నిం టితో కలిపి ఒక్కచోట యంత్రాలను నెలకొల్ప డానికి మొత్తం రూ.21.89 లక్షలు ఖర్చవనుంది. ఇలాంటి యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రదేశాల్లో నెలకొల్పడానికి ప్రభుత్వం సుమారుగా రూ.43.78కోట్లు ఖర్చుచేయనుంది.

🔴గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంటివద్దకే రేషన్‌ సరుకులు పంపించనుంది.అవును..ఇంటి వద్దకే రేషన్‌ సరుకులను పంపించే విధంగా కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియమించనున్న గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్ల ద్వారా రేషన్‌ సరుకులను ప్రజలకు అందించి రేషన్‌ సరుకులు పక్కదారి పట్టడాన్ని ప్రభుత్వం అరికట్టనుంది. 👉ఈ ప్రక్రియ సెప్టెంబర్‌ నెల నుండి అమల్లోకి రానుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading