సాధారణం గా ఫైన్లు ఎందుకు వేస్తారు..ఏదైనా తప్పు చేసినందుకు వేస్తారు. 👉 హెల్మెట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని..నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కు చేసారని. ట్రిఫుల్ రైడింగ్‌కు.. రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారని ఫైన్ వేయటం తెలిసిందే. అది మాములే.
🔴కొత్త రకం ఫైన్ ఇది : అందుకు భిన్నంగా ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా కొత్త రకం ఫైన్ వేసాడు.దాని వల్ల అతని టోపీ కే ముప్పొచ్చింది.
🔴వివరాల్లోకి వెళ్తే : అందంగా ఉందన్న కారణంగా ఒక అమ్మాయికి ఫైన్ వేసాడు ఒక ట్రాఫిక్ పోలీస్ .ఈ ఉదంతం మే 25న ఉరుగ్వేలోని పేసందు అనే పట్టణంలో చోటు చేసుకుంది.ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
👉చలానా కూడా రాసిచ్చాడు : బైక్ మీద వెళుతున్న ఒక మహిళ అందంగా ఉండటంతో.. ఇంత అందంగా ఉన్నందుకు ఫైన్ అంటూ చలానా రాసివ్వటమే కాదు.. అందంగా ఉండటమే నేరమన్న విషయాన్ని రాసేసిన చిత్రమైన ఉదంతం ఉరుగ్వేలో చోటు చేసుకుంది. బైక్ మీద వెళుతున్న ఒక అమ్మాయి చాలా అందంగా ఉందంటూ ఒక పోలీసు ఆమెకు జరిమానా విధించాడు. అయితే.. అదేమీ అక్కడ రూల్ కాదు. రోటీన్ కు భిన్నంగాతింగరి వేషాలు వేసి ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు.. అందంగా ఉండి పబ్లిక్ రోడ్డులో వెళుతున్నందుకు ఫైన్ కట్టండి అంటూ రాసిచ్చాడు.
🔴ఆమెకు మండి..!! : మనోడి వేషాలు కు ఆమెకు మంట పుట్టింది. అతగాడి ట్రిక్ కు ఇంప్రెస్ కావటం తర్వాత.. ఒళ్లు మండిపోయి ఆ పోలీస్ పై కంప్లైంట్ చేసింది. మనోడి మనసు పారేసుకోవటం తర్వాత.. డ్యూటీలో ఉండి ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినందుకు అతగాడి మీద విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం ఒక్కసారిగా పెను వివాదంగా మారడం తో ఈ ఘనకార్యం చేసినందుకు ఆ కుర్ర పోలీసు ఉద్యోగం ఊడిపోయేలా ఉందట ఇప్పుడు . ☝అంటే ఆ అమ్మాయ్ ఆ పోలీస్ టాప్ లేపేసినట్టేగా..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.