మెదడును దొంగిలించిన శాస్తవేత్త

Spread the love

ఐన్‌స్టీన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త.జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్‌స్టీన్ 76 ఏళ్ల వయస్సులో 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ప్రిన్‌సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు.

🔴ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు :

మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే, ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్‌స్టీన్ మరణం తర్వాత మృతదేహానికి డాక్టర్ థామస్ హార్వే..అనే వైద్యుడు పంచనామా నిర్వహించారు.

🔴ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించాడు: అయితే పంచనామా నిర్వహించిన థామస్. హార్వే ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించాడు.ఇలా చేసినట్టు ఐన్‌స్టీన్ కుటుంబికుల కు కూడా తెలియదు.ఎవరికి తెలియకుండా హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు.

🔴 మెదడు పై పరిశోధనలు చేశాడు :

ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించిన హార్వే..దానిపై ఎన్నో పరిశోధనలు చేశాడు దాని బరువును 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధనశాలలోని బేస్మెంట్‌లో జాగ్రత్తపరిచాడు. అసలు ఐన్‌స్టీన్ మెదడుపై అధ్యయనం చేయడానికే హర్వే ఈ దొంగిలింపు చర్యకు పాల్పడినట్లు తెలిసింది.

🔴ఆ మెదడుతో ప్రపంచ పర్యటన : ఆ తర్వాత ఆ మెదడుతో హర్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తర్వాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.

🔴 ఆ తర్వాత ఎంతో మంది శాస్త్రవేత్తల పరిశోధనలు : ఆ తర్వాత
ఐన్‌స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్లు రహస్యంగానే సాగాయి. అతని మేధస్సుకు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆతృతగా ఎదురుచూశారు. చివరికి 1985లో ఐన్‌స్టీన్ మెదడు ప్రత్యేకతలను బయటపెట్టారు.

🔴ఆయన మెదడు యొక్క ప్రత్యేకత : ఐన్‌స్టీన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది. 👉సాధారణ మెదడులో కంటే 17 శాతం అధిక న్యూరాన్లు ఐన్‌స్టీన్ మెదడులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు. 👉ఆయన మెదడులోని లోయర్ పరిటాల్ లాబ్ 20 శాతం పెద్దదిగా ఉండటం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధనాలన్నింటికి మూల కారణం అయిన థామస్ హార్వే ను మాత్రం వృత్తి విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను తన ఉద్యోగం నుండి తొలగించారు చివరికి . హర్వే చేసిన చర్య తప్పే అయినా ఆ తర్వాత మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగకరం గా నిలిచింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading