షాకింగ్ న్యూస్ : వరుణ్ తేజ్ కి కార్ ఆక్సిడెంట్..ఆందోళన లో అభిమానులు..

Spread the love

ఫిదా,తొలి ప్రేమ,తాజా గా F2సినిమాల లో నటించిన హీరో వరుణ్ తేజ్ యాక్సిడెంట్ కి గురయ్యారు.వరుణ్ ప్రయాణిస్తున్నకార్ వనపర్తి లోని కొత్తకోట వద్ద యాక్సిడెంట్ కారణంగా దెబ్బతింది.

🔴 వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం జాతీయ రహదారి రాణిపేట దగ్గర యూ టర్న్ అవుతున్న కారును వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు.

🔸వరుణ్ తేజ్ సేఫ్ : వరుణ్ తేజ్ కి ఆక్సిడెంట్ అన్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే ఆక్సిడెంట్ అయినప్పుడు లక్కీగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో వరుణ్ తేజ్ సేఫ్ గా బయటపడ్డారు. 👉అయితే వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అభిమానులు,కుటుంభ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

🔴కాగా వరుణ్ తేజ్ త్వరలో వాల్మీకి గా మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. వరుణ్ తేజ్ మంచి సినిమాలతో ఎప్పుడూ మనల్ని అలరించాలని నిత్యం ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని కోరుకుందాం .


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading