Teluguwonders: ఆ నగరంలో నిర్మించబడిన క్రైస్తవ ఆలయం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది ఆ కట్టడాన్ని చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.అయితే 137 ఏళ్ల తర్వాత ఈ కట్టడం గురించిన ఒక నిజం బయటపడింది దాంతో అధికారులు తల పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే ..
🔴అసలు ఏమైంది ఆ కట్టడానికి..: స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉన్న సగరాడా ఫమిలా సుప్రసిద్ధ క్రైస్తవ ప్రార్ధనా మందిరం. 2005లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రోజూ కొన్ని వేలమంది దాన్ని సందర్శిస్తూ ఉంటారు. సగరాడా ఫమిలా నిర్మాణం 1882లో మొదలయింది. అయ్యింది.మూడేళ్ళ కిందట ఒక సందర్భంలో కట్టడానికి సంబంధించి ఒక విషయం అధికారుల దృష్టికి వచ్చింది .
🔴అది ఏమిటంటే…!!? : ఈ చారిత్రక భవన నిర్మాణానికి అనుమతి లేదట ! ఎందుకు తీసుకోలేదని నిర్వాహకుల్ని అడిగితే, ‘‘దాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. బార్సిలోనాను అనుకొని ఉన్న చిన్న గ్రామంలో ఈ పనులు మొదలయ్యాయి. 1885లో అనుమతి కోసం డిజైనర్ దరఖాస్తు చేశారు. కానీ సమాధానం రాలేదు!’’ అని చల్లగా చెప్పారు.
🔴చివరకు అనుమతి ఇచ్చేశారు.: ‘ఇన్నేళ్ళుగా ‘అక్రమ నిర్మాణం’గా ఉన్న ఈ భవనాన్ని ఎలా వదిలేశాం?’ అని అధికారులు తలలు పట్టుకున్నారు. ఎన్నో మల్లగుల్లాలు పడి చివరకు కిందటి వారంలో అనుమతి ఇచ్చేశారు. త్వరగా నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని కమిటీకి ఆదేశాలిచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.