Teluguwonders: భూమికి 7800 కాంతి సంవత్సరాల దూరంలోని ‘వి404 సైగ్నిస్’ అనే బ్లాక్‌హోల్ అద్భుత విన్యాసాన్ని ప్రదర్శించింది.అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న ఆ కృష్ణబిలం.. ఉన్నట్టుండి ఒళ్లు విరుచుకుంది!
⚫స్థల కాలాలను మింగేస్తుంది : సాపేక్ష సిద్ధాంతంతో మాత్రమే కొలవగలిగినంత వేగంతో ప్లాస్మాను అన్నిదిశలకూ విరజిమ్ముతూ చుట్టూ ఉన్న స్థల కాలాలను తనలోకి లాగేసుకోవడం మొదలుపెట్టింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు కృష్ణ బిలం అంటే ఏంటో తెలుసుకోవాలి.
👉⚫కృష్ణ బిలం : ఈ విశ్వంలో ఏ స్థానంలో అయితే గ్రావిటీ(గురుత్వాకర్షణ శక్తి) స్థాయి చాలా ఎక్కువ ఉంటుందో..అంటే..ఏది కూడా ఆ శక్తి నుండి బయటకి తప్పించుకోలేదో..ఆకరికి వెలుగు కూడా..ఆ స్థానాన్ని కృష్ణ బిలం అంటారు.
⚫ఇవి ఎలా తయారవుతాయి? : ఈ విశ్వంలో దేనికైనా ఒక వయస్సు ఉంటుంది.. నక్షత్రాలకి కూడా ఒక వయస్సు ఉంటుంది…అలా ఆ నక్షత్రాలు ముసలివి అయ్యాక.. చనిపోతాయ్..అలా చనిపోయిన నక్షత్రాలు..పరిమాణంలో(అంటే వాటి పరిమాణం తో పోలుస్తే) చాలా చిన్నగా అయ్యి..దానిలో ఉన్న ఆ గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ అవుతుంది…ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల..ఈ కృష్ణ బిలాలు ఏర్పడతాయి…
ఉదాహరణ కి : ఇప్పుడు మన భూమినే తీసుకోండి..మన భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా..దాని వల్ల మనము భూమి మీదనే ఉంటున్నాము.. కానీ దీని కన్నా కొంచం ఎక్కువ శక్తి ఉపయోగించి మనం రాకెట్,విమానాలల్లో పైకి వెళ్లగలుగుతున్నాం .
ఒక వేళ అదే మన భూమి పరిమాణం లో చిన్నగా..చాలా చిన్నగా అయ్యింది అనుకోండి. అప్పుడు ఈ శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువైపోతుంది.. అప్పుడు దాని చుట్టూ ఉన్న… ఆకర్షణ వలయం దాటి దాని పరిధిలోకి ఏది వచ్చిన…దాని నుండి బయట పడటం కష్టం…అంత శక్తి ఉంటది అన్నమాట. ఇలా ఏర్పడతాయి..కృష్ణ బిలాలు.ఇంకో విషయం..ఈ నక్షత్రాలు అంటే చనిపోయేవి…మనకి తెల్సినంత పెద్దగ కాదు…ఇంకా చాలా పెద్దగ ఉంటై..మన సూర్యుడికంటే పెద్దగా..20 రెట్లు పెద్దగా ఉంటాయంట.మన శాస్త్రవేత్తలు వీటిని స్టడీ చేస్తుంటారు…అసలు ఎన్ని కృష్ణ బిలాలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పడం కష్టం..
⚫వాటి ఆయుష్షు ఎంత : ఇవి అసలు ఇలా ఎంత కాలం ఉంటై..అనే సందేహం కూడా వచ్చింది..ఐతే ముందు అసలు ఇవి ఇలానే ఉంటాయి అని అనుకునేవారు..కాని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అధ్యయనం చేసి…అవి అలా ఎప్పుడూ ఉండవు అని చెప్పారు..ఒక సమయం వచ్చాక అవి కూడా చనిపోతాయి అని చెప్పారు..అది ఎలా అంటే…వాటి ఆకర్షణ శక్తి పని చేస్తూ ఉన్నప్పుడు దానిలోని ఆ శక్తి మెల్లగా తగ్గుతూ ఉంటుందంట..అలా మొత్తం తగ్గిపోయాకా…అవి..ఈ విశ్వంలో కలిసిపోతాయంట..
⚫ వార్మ్ హోల్స్ : ఇంకొందరు శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి…ఈ బిలాలు..వేరే విశ్వానికి దారి అని..ఇవి ఇలా లోపలికి అన్నిట్లని పీల్చుకొని..వేరే విశ్వం లో వదులుతాయని…చెప్పుకొచ్చారు. వీటిని bridges లేదా wormholes(వార్మ్ హోల్స్) ..అంటారట. ఇదైతే ఎవరికీ నమ్మశక్యంగా లేదు.. ఇది ఊహజనితం మాత్రమే…
⚫ కృష్ణ బిలం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? : కృష్ణ అంటే నలుపు…అందుకే కృష్ణ బిలం అన్నారు..అక్కడ అంత నల్లగా ఉంటుంది కాబట్టి.
🔎తిరిగి విషయానికి వస్తే :
1989లో ఈ కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు గుర్తించారు. అప్పట్లో అది భారీగా జ్వాలలను, రేడియేషన్‌ను విరజిమ్మడంతో దాన్ని గుర్తించగలిగారు. అంతకుముందు 1938,1956ల్లో కూడా అది అలాగే విరజిమ్మినట్టు గుర్తించారు.
మళ్లీ 2015లో కూడా అది అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రజ్ఞులంతా టెలిస్కోపులను ఆవైపునకు గురిపెట్టి దాని ప్రవర్తనను గమనించడం మొదలుపెట్టారు. అప్పట్లో సేకరించిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రిసెర్చ్ (ఐసీఆర్‌ఏఆర్)కు చెందిన కర్టిన్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు విశ్లేషించి ఈ అద్భుతాన్ని గుర్తించగలిగారు. బాత్‌రూమ్‌లో బకెట్‌తో నీళ్లు పెద్దమొత్తంలో వంపేస్తే.. ఆ నీరు ఎలా సుడులు తిరుగుతూ డ్రైన్‌లోకి వెళ్లిపోతుందో, ఈ కృష్ణబిలం తనచుట్టూ ఉన్న స్థలకాలాలను తనలోకి అలాగేసుకుంటోందని గుర్తించారు. ఇది కృష్ణబిల వ్యవస్థలన్నింటిలోనూ అసాధారణమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.