🔰లిచి ఫ్రూట్ : విదేశాలతో పాటు మన దేశ మార్కెట్లోనూ లభించే ఈ లిచి పండ్లలో సాట్యురేటెడ్ ఫ్యాట్, సోడియమ్, కొలెస్టరాల్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు పనికి వస్తాయి.దీనిలో 125 క్యాలరీల శక్తి వుంటుంది. ఈ పండ్ల లో విటమిన్ సి, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పండ్ల నుండి తీసిన లిచి జ్యూస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. చైనా దక్షిణ ప్రాంతంలోLichi Fruits బాగా పండుతాయి. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఒక ప్రాంతం లో మాత్రం లిచి ని తినడం వల్ల జనాలు ప్రత్యేకంగా పిల్లలు మరణిస్తున్నారు .
🔴వివాదాస్పదంగా లిచి పండు :
ఉత్తరాదిలో లిచి పండు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఇటీవల 48 మంది పిల్లలు మరణించారు. వీరంతా పదేళ్ళ లోపు పిల్లలే. వీళ్ళందరూ లిచి పండు ద్వారా సంక్రమించిన వ్యాధి వల్లే మరణించారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
🔴బీహార్‌లో లిచి పండ్లు తిని మరణాలు : గత కొన్నేళ్ళుగా బీహార్‌లో లిచి పండ్లు తిని పిల్లలు మరణించడం పరిపాటిగా మారింది. బుధవారం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను బట్టి చూస్తే పిల్లల మృతికి Lichi Fruit కారణమా అన్న అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి.
🔴పిల్లలకు లిచి పండ్లు పెట్టొద్దు: పిల్లలకు లిచి పండ్లను పరకడుపున పెట్టొద్దని బీహార్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే మాగని, దోరగా ఉన్న లిచి పండ్లను పెట్టొదని హెచ్చరింది. వైద్యులు కూడా హాస్పిటల్‌కు వస్తున్న పిల్లలను పరిశీలిస్తున్నారు. వీరు పండని లిచి తిన్నారా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరకడుపున లేదా పండని లిచి పండ్లను తినడం వల్ల మెదడు వ్యాపు వ్యాధి వస్తోందని వైద్యులు భావిస్తున్నారు.
🔴లిచి వల్ల వ్యాధులు : తోటలోదొరికే పిల్లలు పరకడుపున వీటిని తినేస్తుంటారు. అలాగే ఇంకా మాగని పండ్లను అదేపనిగా తినేయడం, టిఫిన్ తినకపోవడం వల్ల మెదడు వ్యాపు వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉పైగా పౌష్ఠికాహారం లోపించిన పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.