వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు. తిథి అనే పదం నుండే తేదీ అనే పదం వాడుక లోకి వచ్చింది. తిథి అంటే… తేది, దినము, రోజు అని అర్థం.
🔴తేదీ : ప్రస్తుత కాలంలో ఈరోజు తేది (date)ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసో, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది.
🔴తిథి : గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే వాడుక లో ఉండేది.
🔴తిథి ఏ విధంగా ఏర్పడు తుంది అంటే : ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా 🌙కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా 🌕అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణమి. ఆ తరువాత రోజు నుండి చందమామ తిరిగి దినదినానికి క్షీణించి.. పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు తిరిగి అమావాస్య. 🌑 ఈ అమావాస్య నుండి అమావాస్య కు చంద్రుడి రూపం లోని హెచ్చుతగ్గులను తిధులు అంటారు . ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది. (నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిథిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.