14 కోట్లు ఫైన్ వేసిన సచిన్..

sachin
Spread the love

Teluguwonders: బ్రాండింగ్ స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ ను అమ్మే వారు ఆటగాళ్ల బొమ్మలను రకరకాలుగా ప్రింట్ చేస్తూ ఉంటారు.స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ పై ఆయా స్పోర్ట్స్ స్టార్స్ బొమ్మలు ఉండటం సహజమే. . స్టిక్కర్ల రూపంలో – పేర్ల రూపంలో ఆటగాళ్ల ఇమేజ్ ను వాడుకొంటూ స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ ను అమ్ముకుంటూ ఉంటారు.కానీ ఆ వాడటానికి కూడా దానికి కాల పరిమితి ఉంటుంది కదా..
ఇలాంటి వ్యవహారానికి సంబంధించిన ఒక వివాదం తలెత్తింది.

🔴విషయం ఏమిటంటే : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు – ఒక ఆస్ట్రేలియన్ క్రికెట్ బ్యాట్స్ ఉత్పత్తి సంస్థకూ మధ్యన వివాదం తలెత్తింది.తన అనుమతి లేకుండా తన ఫొటోను క్రికెట్ బ్యాట్లపై ముద్రించి అమ్మినందుకు పద్నాలుగు కోట్ల రూపాయల పరిహారాన్ని కట్టించాలని సచిన్ టెండూల్కర్ ఒక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ తయారీ సంస్థకు నోటీసులు ఇచ్చారు.

👉వివరాల్లోకి వెళ్తే : స్పార్టన్ అనే ఆ బ్యాట్ల మేకర్లకు మొదట్లో సచిన్ తో ఒప్పందం ఉండేదట. ఆ మేరకు ఆయన స్టిక్కర్లను బ్యాట్ల మీద ముద్రించి అమ్మే వారట.

🔴ఒప్పందం గడువు ముగిసినా : ఆ ఒప్పంద గడువు ఇటీవలే ముగిసిందట.అయినా సదరు సంస్థ యథారీతిన టెండూల్కర్ ఫొటోలను బ్యాట్ల మీద ముద్రించి అమ్మసాగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఈ మాజీ క్రికెటర్ దృష్టికి వచ్చిందట.

🔴లీగల్ గా : ఈ వ్యవహారం పై లీగల్ గా స్పందిస్తున్నాడు టెండూల్కర్. పరిమితి దాటిన తర్వాత కూడా తన పేరుతో మార్కెటింగ్ చేసినందుకు తనకు పద్నాలుగు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని Sachin టెండూల్కర్ ఆ సంస్థకు నోటీసులు పంపించినట్టుగా సమాచారం!


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading