తన దేశ గెలుపు కోసం అలుపెరగకుండా యుద్ధం చేసే ధీరుడు కి అనుకోని చేదు వార్త తెలిస్తే ,అతడి పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెటర్ అసిఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది . ఒకపక్క వరల్డ్ కప్ మ్యాచ్ ,మరోపక్క మనసుని మెలిపెట్టే బాధ. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాడు క్రికెటర్ అసిఫ్ అలీ .కారణం
🔵తిరిగిరాని లోకాలకు అసిఫ్ కూతురు: అవును..అసిఫ్అలీ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది. గత కొన్ని రోజులుగా ప్రమాదకర క్యాన్సర్‌తో పోరాడుతున్న అలీ బిడ్డ 18 నెలల నూర్ ఫాతిమా తనువు చాలించింది. మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తీసుకుని వెళ్లి చికిత్స చేయించినా.. నూర్ ఫాతిమా ప్రాణా న్ని కాపాడలేకపోయాయి. 👉కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు అలీ కూతురు మరణానికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపింది.
🔴ఇంజామాముల్ హక్ ప్రకటన : ఈసోమవారం ప్రపంచకప్ టోర్నీకి మార్పు లు, చేర్పులతో జట్టును ప్రకటిస్తూ చీఫ్ సెలెక్టర్ ఇంజామాముల్ హక్ ఈ చేదు వార్తను మీడియా ముఖంగా ప్రకటించాడు. “కూతు రు కోల్పోయి కడు బాధలో ఉన్న అసిఫ్ అలీకి మేమందరం అండగా ఉన్నాం. లాహోర్‌లో జరిగే అంత్యక్రియల కోసం ఇంగ్లండ్ నుంచి పాక్‌కు అలీ బయల్దేరి వస్తున్నాడు. కార్యక్రమాలు పూర్తి చేసుకుని వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌ల కోసం అలీ తిరిగి ఇంగ్లండ్ బయల్దేరి వెళ్తాడు” అని ఇంజామామ్ పేర్కొన్నాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.