నెలల పసి బిడ్డ పై అత్యాచారం ,భగ్గుమన్న ప్రజలు

Spread the love

Telugu Wonders

సొసైటీ లో అసలు మగాళ్లంటేనే అసహ్య పడే రోజులు వచ్చేసేలా ఉన్నాయనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. దారుణం అంటే మామూలు దారుణం కాదు ,మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణం ఇది . సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొనే ఘోరం. అత్యాచారాలకి అంతూ పొంతూ లేకుండా పోతుంది .చిన్నా లేదు, పెద్దా లేదు ,ఆడవారైతే చాలు అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తున్నారు . ఆఖరికి అప్పుడే పుట్టిన పసిపాపల ను కూడా ఆ దుర్మార్గులు వదలట్లేదు. అందుకు ఈ ఉదంతమే పెద్ద ఉదాహరణ .పొత్తిళ్ల లోని 9 నెలల పసిపాపనుఓ మానవమృగం అత్యంత ఘోరంగాఅత్యాచారం చేసి ఛిదిమేసిన దారుణ ఉదంతం ఇది.

అప్పటి దాకా తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న చిన్నారి అదృశ్యమై కొద్దిసేపటికి మృతదేహంగా కనపడటం తో ఆ తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి..

🔴వరంగల్‌ జిల్లాలో దారుణమైన ఘటన : వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలోని టైలర్ స్ట్రీట్‌లో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ ఘోరాతిఘోరమైన స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన స్థానికుల గుండెలూ చెరువయ్యాయి.

🔴 వివరాల ప్రకారం: చిన్నారి తల్లిదండ్రులు జగన్ రచన.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటున్నారు. తండ్రి జగన్ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌. తల్లి రచన గృహిణి. వారికి పెళ్లయిన ఐదేళ్లకు పాప పుట్టడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

పుట్టు వెంట్రుకలు తీసేందుకు మూడు రోజుల క్రితం వేములవాడకు వెళ్లారు. హన్మకొండలో బంధువుల పంక్షన్‌ ఉండడంతో హాజరయ్యేందుకు తిరుగు ప్రయాణంలో హన్మకొండలోనే ఉంటున్న పాప అమ్మమ్మగారి ఇంట్లో ఆగారు. మంగళవారం రాత్రి మేడపై నిద్రకు ఉపక్రమించారు.

👉అర్ధరాత్రి 2గంటల సమయంలో ; మంగళవారం తల్లిదండ్రులతో కలిసి దాబాపై నిద్రిస్తుండగా..అర్ధరాత్రి 2గంటలప్పుడు వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం వసంతాపూర్‌ గ్రామానికి చెందిన పోలెపాక ప్రవీణ్‌ (25) అక్కడికెళ్లాడు. పాపను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు . అరగంట తర్వాత పాప కనిపించడం లేదని గుర్తించిన తల్లి.. తన తమ్ముడిని అప్రమత్తం చేసింది. అతడితో పాటు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులంతా పరిసరాల్లో వెతికారు. 100కు డయల్‌ చేయడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.

👉పరిసరాల్లో వెతుకుతుండగా ; పాపను టవల్‌ల్లో చుట్టి తీసుకెళుతున్న ప్రవీణ్‌ను గమనించి వెంబడించారు. వెంటనే ప్రవీణ్‌ చేతుల్లో ఉన్న పాపను దూరంగా విసిరేసి పరుగుతీశాడు. అతడిని వెంటాడి పట్టుకున్న యువకులు తీవ్రంగా కొట్టారు.పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

🔴పాప..పరిస్థితి ; పాప తీవ్ర రక్తస్రావంతో ఎలాంటి కదలికలు లేకుండా ఉండడంతో హుటాహుటిన మాక్స్‌కేర్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప మృతి చెందింది. పాప మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు నిందితుడిపై 366, 302, 376ఎ, 376 ఏబీ, 379 ఐపీసీ సెక్షన్లతో పాటు 5(ఎం) రెడ్‌విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హన్మకొండ ఏసీపీ చల్లా శ్రీధర్‌ తెలిపారు. 🔥నిరసన జ్వాలలు ; బుధవారం సాయంత్రం ప్రవీణ్‌ను కోర్టుకు అప్పగించగా రాత్రి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ దారుణం పై ప్రజలు మండిపడుతున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు.

🔴హన్మకొండలోని అశోక కూడలి వద్ద స్థానికులు మానవహారం చేపట్టారు. చిన్నారిని. ఘోరంగా చంపేసిన. కిరాతకుడిని ఉరితీసే వరకు ఆందోళన విరమించేలేదని నిరసనకు. దిగారు. స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు చేరుకొని వారిని చెదరగొట్టడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
👉పాప కోసం ఆ దుర్మార్గుడుఇలామాటు వేశాడు ;
పాప అమ్మమ్మ ఇంటికి సమీపంలో ఉండే ప్రవీణ్‌.. ఘటనకు ముందు రోజు కూడా పాప దగ్గరకు వెళుతుండడంతో గమనించిన చుట్టుపక్కల వాళ్ళు బెదిరించడంతో పరారయ్యాడు. ఈ క్రమంలో మాటువేసిన అతడు అర్ధరాత్రి తల్లి గాఢనిద్రలో ఉండగా పాపను ఎత్తుకెళ్లాడు.

🔸ప్రవీణ్‌ అర్ధరాత్రి తిరుగుతూ అవకాశం దొరికితే దొంగతనాలు లేదంటే లైంగిక దాడులకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నాడని, ఇటీవల కొందరు మహిళలను చూస్తూ అశ్లీలంగా ప్రవర్తిస్తుండడంతో స్థానికులు హెచ్చరించారని తెలిసింది.
👉మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తీవ్ర స్పందన :
ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తీవ్రంగా స్పందించారు. నిందితుడు ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఎర్రబెల్లి


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading