#స్వర్గానికి రోడ్డు మార్గం

Spread the love

TeluguWonders : From Whats app Message

#స్వర్గానికి రోడ్డు మార్గం*
(Road route to SWARGA)
పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే.#మన :- బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం.

…..🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙

ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.

ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.మన నుండి చట్మోలి 8km మార్గ మధ్యమం లో #భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.

తరవాత #మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు.ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక వసుధార జలపాతం వస్తుంది.

ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.

ఇక్కడ గాలులు బలం గా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:-

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.

పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.ఇక్కడే సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అనే రెండు నదులు ( హిమానీనదాలు ) కలిసి #అలకనంద గా ఏర్పడతాయి.

అక్కడి నుండి ముందుకు వెళితే #ధనో హిమానీనదం కు చేరుకుంటాం.

చట్మోలి నుండి లక్ష్మి వన్ 1km ( 12600 అ ఎత్తు లో ):తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదం గా ఉంటుంది.

ఇక్కడే లక్ష్మి & విష్ణువు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.

ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని చెప్తారు.

ఇక్కడి నుండి 2km ప్రయానించాక బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం.

ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.

బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో):

సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)

చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.

ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km:

ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే సరస్సు.

ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.

ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్ నుండి స్వర్గారోహిణి 8 km:-

ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు.

మార్గం లో చంద్రకుండ్ & సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయట.

ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే కుక్క తోడూ రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.

నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading