10 గ్రాముల బంగారం ధర రూ. 74 వేలు..!

The price of 10 grams of gold is Rs. 74 thousand
Spread the love

Teluguwonders:

మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటి. భారత దేశంలో మే నెలలో 33,000 రుపాయలు పలికిన బంగారం ధర ప్రస్తుతం 38 వేల రుపాయలకు చేరింది. అతి త్వరలో బంగారం ధర 40,000 రుపాయల మార్కు కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశమైతే లేదని సమాచారం. బంగారం వర్తకుల నుండి భారీగా డిమాండ్ పెరగటం, ఫెడ్ వడ్డీ రేటు, చైనా అమెరికా దేశాల మధ్య ట్రేడ్ వార్ లాంటి పరిణామాల వలన బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది.

మన దేశంలో పేద, మధ్య తరగతి వర్గాలు బంగారం చాలా ఖరీదవుతుందని చెబుతోంటే పాకిస్తాన్ దేశంలో బంగారం ధర ఇండియాతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉంది.

పాకిస్తాన్ లో ప్రస్తుతం పది గ్రాములు బంగారం ధర 74,500 రుపాయలుగా ఉంది. తులా బార్స్ బంగారం ధర 87,000 రుపాయలుగా ఉంది. పాకిస్తాన్ లోని ఒక నగరానికి ఇంకో నగరానికి మధ్య బంగారం ధరలలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ లోని కరాచీలో 24 క్యారెట్ల తులా బార్ 87,000 రుపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 74,500 రుపాయలు, 22 క్యారెట్ల బంగారం 68,300 రుపాయలుగా ఉంది. ఇతర నగరాలైన క్వెట్టా, పెషావర్, సియాల్ కోట్ నగరాల్లో ధరకు కరాచీలోని ధరకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం తరువాత ఎక్కువగా ఉపయోగించే వెండి ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారతదేశంలో బంగారం ధర భారీగా పెరగటంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేయటానికి వెనుకడుగు వేస్తున్నారు. హైదరాబాద్ లో బంగారం ధర 24 క్యారెట్లు 37,830 రుపాయలుగా, 22 క్యారెట్లు 36,030 రుపాయలుగా ఉంది. కిలో వెండి ధర 47,500 రుపాయలుగా ఉంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading