Teluguwonders:
ప్రఖ్యాత సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.
🔴వివరాల్లోకి వెళ్తే :
మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92)సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖయ్యం ముంబైలో సుజయ్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆయనకి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. కభీ కభీ(1972), నూరీ(1979), ఉమ్రావో జాన్(1981), రజియా సుల్తాన్(1983), బజార్(1982) వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు.
ముహమ్మద్ జహూర్ ఖయ్యాం ప్రముఖ హిందీ సినీ గీత స్వరకర్త మరియు సంగీత దర్శకుడు. ఖయ్యూం గా ప్రసిద్దుడు.
✍ముహమ్మద్ జహూర్ ఖయ్యామ్ :
1927 ఫిబ్రవరి 18న పంజాబ్ లోని నవన్షహర్ జిల్లా, రహోన్ లో ఆయన జన్మించారు. 2012లో 85వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముహమ్మద్ జహూర్ వయస్సు నిన్నటికి : 92 సంవత్సరాలు..ఆయన జీవిత భాగస్వామి పేరు జగ్జీత్ కౌర్.
🔴కెరీర్:
స్వరకర్త, సినీ గీత స్వరకర్త అయిన ఖయ్య్యం పొందిన
పురస్కారములు:
👉1977: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: కభీ కభీ
👉1982: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: ఉమ్రావ్ జాన్
👉2007: సంగీత నాటక అకాడమీ పురస్కారము: సృజనాత్మక సంగీతము
👉2010: ఫిల్మ్ ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారము. 👉సంగీతంలో ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఉమ్రావోజాన్ చిత్రానికి జాతీయ అవార్డును సైతం అందుకున్నారు.
🔴అవార్డ్స్ కి..పరిశీలించినవి:
1980: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: నూరి (సినిమా)
1981: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: థోడీసీ బేవఫాయి
1982: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: బాజార్
1984: ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారము: రజియా సుల్తానా (సినిమా)
👉ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.