వన్డే ఆటల్లో రాబోతున్న ఆ మార్పు..!!?

Ravi Shastri again as coach
Spread the love

Teluguwonders:

విండీస్ టూర్‌లో ఆడిన రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం తో… రెండో పర్యాయం కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి
వన్డేలో జరుగబోయే మార్పులను ప్రకటించారు.

💥రవిశాస్త్రి ఇంటర్వ్యూ లో:

భారత్ జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్యకి త్వరలోనే ఓ పరిష్కారం దొరుకుతుందని టీమిండియా హెడ్ కోచ్.

రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. రెండో పర్యాయం మళ్లీ హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
2021 వరకూ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగనుండగా.. అతని శిక్షణలో భారత్ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, రెండు టీ20 ప్రపంచకప్‌లు, కొన్ని కఠినమైన ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతోంది. ఈ నేపథ్యంలో.. జట్టులో సమతూకం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

‘2020, 2021లో జరగనున్న ఐసీసీ టీ20 టోర్నమెంట్‌లతో పాటు ఈ ఏడాది ఆరంభంకానున్న టెస్టు ఛాంపియన్‌‌‌‌షిప్‌‌ గెలవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం. అలా అని వన్డేలపై అశ్రద్ధ వహించం. నిజమే.. 2023 వరకూ వన్డే ప్రపంచకప్‌ లేకపోవచ్చు. కానీ.. గత రెండేళ్లలో ఎలా అయితే యువ క్రికెటర్లకి అవకాశాలిస్తూ వన్డే జట్టుని సిద్ధం చేసుకుంటూ వచ్చామో..? అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు వన్డే జట్టులో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో వెలుగులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యరే దీనికి ఉదాహరణ. ఇకపై అతను నెం.4 స్థానంలో ఆడబోతున్నాడు. ఇంకా చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వారి ప్రతిభ ఆధారంగా కచ్చితంగా టీమ్‌లో అవకాశాలిస్తాం’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

🔴రిషబ్ పంత్ వైఫల్యం :

మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో వికెట్ కీపర్‌గా సిరీస్ మొత్తానికీ రిషబ్ ఎంపికయ్యాడు వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో కీలకమైన నెం.4 స్థానంలో ఆడిన రిషబ్ పంత్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 20 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇందులో ఒకటి గోల్డెన్ డక్.

🔴 ఇక నుండి నెం.4లో శ్రేయాస్‌ :

వరుసగా నెం.5లో ఆడిన శ్రేయాస్ అయ్యర్ రెండు అర్ధశతకాలతో మెరిశాడు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండు శతక భాగస్వామ్యాలను కూడా సిరీస్‌లో ఈ యువ హిట్టర్ నమోదు చేయడంతో.. నెం.4లో శ్రేయాస్‌నే ఆడించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి 👉వెస్టిండీస్ పర్యటనలో ఇప్పటికే మూడు టీ20లు, మూడు వన్డేలు ముగియగా.. గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading