మెగా పుట్టిన రోజు వేడుకలో సుధీర్‌ను బుక్ చేసిన ఫ్యాన్స్!!

Spread the love

Teluguwonders:

మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది.

భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్:

మెగా అభిమానులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే చాలా మంది శిల్పకళావేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో హైటెక్ సిటీ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

అదే సమయంలో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. ఈ ఫంక్షన్ వల్ల హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా ఉంది. వాస్తవానికి ఉదయం నుంచే చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పాసుల కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు.

ప్రతిష్టాత్మకమైన ఈ వేడుక ప్రారంభంలో పలువురు కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పాటలు, మ్యూజిక్, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా పలువురు అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చారు. వీరిలో నలుగురు చిన్నారులు ఇచ్చిన పర్‌ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ కేకలు వేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

సుడిగాలి సుధీర్‌ను బుక్ చేసిన ఫ్యాన్స్:

ఈ కార్యక్రమంలో మంజుషతో కలిసి యాంకరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుడిగాలి సుధీర్‌ను మెగా అభిమానులు బుక్ చేసేశారు. వేడుకకు హాజరైన వారిలో కొందరు డ్యాన్స్ డ్యాన్స్ అంటూ కేకలు వేశారు. నెక్స్ డ్యాన్సర్స్ వస్తారని అటు మంజుష.. ఇటు సుధీర్ చెప్పినా అభిమానులు వినలేదు. అంతేకాదు, వాళ్లు కాదు.. నువ్వు వేయాలంటూ సుధీర్‌ను ఇబ్బంది పెట్టారు.

ఫ్యాంట్ టైటుగా ఉందంటూనే…

మెగా ఫ్యాన్స్ అంతగా కోరుతుండగా సుధీర్ తన ఫ్యాంటు టైటుగా ఉంది అర్థం చేసుకోండి అని అన్నాడు. అయినా.. వాళ్లు ఆగలేదు. దీంతో చేసేందేం లేక తన బ్లేజర్ తీసేసి. ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా పాటకు డ్యాన్స్ చేశాడు. సుధీర్ వేసిన వీణ స్టెప్‌కు ఆడిటోరియం అంతా ఊగిపోయింది. స్టేజ్‌పై అతడు డ్యాన్స్ చేస్తున్న సమయంలో కింద ఫ్యాన్స్ కూడా కాలు కదపడం విశేషం.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading