Teluguwonders :
అప్పుడు కౌశల్ … ఇప్పుడు రాహుల్
బిగ్ బాస్ సీజన్ 2 లో కౌషల్ ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మూడోవారం నుంచి తన గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. హౌస్ లో ఎంతమంది అణకదొక్కాలని చూసినా ఉప్పెంగే కెరటంలా పైకి ఎగిసి పడ్డాడు. సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్’ సీజన్ లో ఇదే స్థితిలో రాహుల్ ఉన్నాడా..?రాహుల్ కూడా మరో కౌషల్ కానున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తన వాళ్లు అనుకున్నవాళ్లే మోసం చేసి నామినేట్ చేసారు అనే ఉద్దేశంతో ప్రస్తుతం రాహుల్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఎప్పుడు చూసినా నవ్వుతూ గేమ్ ఆడుతాడని, గేమ్ ను లైట్ గా తీసుకుంటాడని…బద్దకంగా ఉంటాడని రాహుల్ ను విమర్శించిన హౌస్ మేట్స్ అందరూ కూడా రాహుల్ కే సలహాలు ఇస్తున్నారు.
గేమ్ ఎలా ఆడాలో చెప్తున్నారు. ముఖ్యంగా టాస్క్ ఆడేటపుడు అసలు పెర్ఫామెన్స్ లేదని నామినేట్ చేసారు. హౌస్ లో 8మంది ఈసారి రాహుల్ ని నామినేట్ చేసారు. శ్రీముఖి కూడా సీజన్ మొత్తం నేను ఖచ్చితంగా నిన్ను నామినేట్ చేస్తానని ముఖంపైనే చెప్పేసింది.నాగార్జున కూడా ఎవరివీ చూపించని వీడియోలు రాహుల్ వే చూపించారు.
నిజానికి అలీ రైజా, అషూ కూడా బ్యాక్ టాకింగ్ చాలా చేసారు. కానీ, వాటిని చూపించలేదు. కేవలం రాహుల్ మాట్లాడింది మాత్రమే చూపించారు. అప్పట్నుంచి శ్రీముఖి ఓపీనియనే మారిపోయింది.
దాంతో రాహుల్ కు సపోర్ట్ చేసే వారు హౌస్ లో లేకపోవడం దారుణంగా ఉంది. అలీ రెజా తనను నామినేట్ చేశాడని బాధపడుతున్న బాబా భాస్కర్ తో “మిమ్మల్ని కేవలం ఒకే ఒక్కడు చేసాడు సార్.. నెలరోజులు మీ పక్కనే తిరిగిన అతను చేస్తేనే మీకు బాధేస్తే,, మరి నన్ను నా ఫ్రెండ్స్ ముగ్గురు నామినేట్ చేసారు.హౌస్ లో 8మంది చేసారు నేనెంత బాధపడాలి” అని రాహుల్ చెప్పడం అందరిని బాధకు గురి చేసింది. నవ్వుతూ ఉండటం నాకు చిన్నప్పటి నుండి అలవాటు.
కానీ నా నవ్వును కూడా వీరు తప్పు పడుతున్నారు. లైట్ తీసుకోమని బాబా భాస్కర్ ను ఊరడించాడు. దీంతో రాహుల్ కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పటికైనా రాహుల్ గేమ్ విషయంలో స్ట్రాటజీని అప్లై చేయాలనీ ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.