Bigg Boss Episode 51 : ఇది అలీ ఎలిమినేషనా.. సంతాప సభా: శ్రీముఖి ఫైర్

Spread the love

Teluguwonders:

Bigg Boss Episode 51 Highlights:

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్‌లను పూర్తి చేసి సోమవారం నాటితో 51వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.

💥శిల్పా చక్రవర్తి ఆధ్వర్యంలో గత వారం ఎలిమినేషన్ ప్రాసెస్..- అలీ ఎలిమినేట్ :

ఆమె ఇద్దరిరిద్దర్ని డార్క్ రూంలోకి పిలిచి ఇద్దరి పేర్లే నామినేషన్‌కి సూచించాలని కోరగా.. రాహుల్, బాబా భాస్కర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, శ్రీముఖి‌లు జంటలుగా అలీ రజాని ఎలిమినేషన్‌కి పంపించారు. ఒక్క శివజ్యోతి, హిమజలు తప్ప మిగిలిన అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగా అలీ ఎలిమినేషన్‌కి కారణమైన వారే.
తీరా అలీ ఎలిమినేట్ అయిన తరువాత.. వాళ్లు ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు నవ్వు వచ్చేట్టుగా చేసింది. బహుషా ఎవరైనా పోతే కూడా ఈ రేంజ్‌లో పెర్ఫామెన్స్ ఇవ్వరంటే అతిశయోక్తి కాదు.‘మీరు ఓడిపోవడం ఏంటయ్యా’.. అన్నంత రేంజ్‌లో నువ్ ఎలిమినేట్ కావడం ఏంటిరా.. అంటూ ఒకర్ని మించి ఒకరు వీరలెవల్లో పెర్ఫామెన్స్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే.. అలీకి ఇంటిలో ఉండటానికి అర్హత లేదంటూ ఓట్లు వేసిన వాళ్లే తిరిగి ఏడుస్తూ జనాల్ని పిచ్చోళ్లను చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎపిసోడ్ ప్రారంభంలో అలీ రజా ఎలిమినేట్ కావడానికి కారణమైన బాబా భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

👉ముఖ్యంగా శివజ్యోతి :

బిగ్ బాస్ హౌస్‌లోకి అనూహ్యంగా అడుగుపెట్టిన తీన్మార్ సావిత్రి (శివజ్యోతి) ఈ 50 రోజుల్లో ఏడవని రోజు అంటే వేళ్లపై లెక్కపెట్టేయొచ్చు. పొరపాటున చిన్న విషయం ఆమెతో చర్చకు వచ్చినా ఆమె కళ్ల నుండి ట్యాప్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఆమె ఏడుపుకి హోస్ట్ నాగార్జున కూడా భయపడిపోతున్నారంటే శివజ్యోతి ఓవర్ క్రయింగ్ ఏం రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నిన్న రాత్రి అయితే ఆమె బోరు బోరున ఏడుస్తుంటే ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకున్నారు. ఆపవమ్మా తల్లీ.. నీ ఏడుపుకి ఒక దండం. అలీ జస్ట్ ఎలిమినేట్ అయ్యాడు అతను పోలేదు అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
“కష్టంగా ఉంది.. నాకు చాలా కష్టంగా ఉంది. అలీ లేకుండా నేను తట్టుకోలేకపోతున్నా.. హౌస్‌లో ఉండటం నా వల్ల కాదు. నాకు నిద్ర కూడా పట్టడం లేదు” అంటూ నిన్నటి ఎపిసోడ్‌లో కన్నీటి ట్యాప్‌ని విప్పిన శివజ్యోతి నేటి ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేసింది. ఆమెను ఓదార్చడంలో బిజీ అయ్యింది పునర్నవి.
ఎమోషనల్‌గా నాతో ఆడుకుంటున్నావ్.. నువ్ మంచోడివి అయితే ఏదైనా ట్విస్ట్ ఇవ్వు. అషు, అలీ మళ్లీ వెనక్కి వచ్చేలా చేయి. అయినా సరే.. నేను గేమ్ ఆడతాను అంటూ ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేయగా.. రవిక్రిష్ణ ఆమెకు అడ్డుపడ్డాడు. నువ్ ఒక్కదానివేనా ఏడ్చేది నేను ఏడొద్దా.. పెర్ఫామెన్స్ ఇవ్వొద్దా అన్నట్టుగా శివజ్యోతితో కలిసి ఏడ్చేందుకు పోటీపడ్డాడు.

💥శ్రీముఖి సీరియస్ :

ఇంతలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ‘ఆపండెహే ఇది సంతాప సభ కాదు.. ఆడు (అలీ) చచ్చిపోలేదు. ఏడుస్తూ కూర్చోడానికి రెండు పీకుతా మిమ్మల్ని ఇద్దర్నీ.. మామూలుగా కొట్టను అని వారించడంతో కాస్త కంట్రోల్ అయ్యారు శివజ్యోతి, రవిలు.

💥సోషల్ మీడియాలో ఆడియన్స్ ట్రోలింగ్స్:

సిస్టర్ అని అప్యాయంగా పిలిచాడు కాబట్టి.. అలీ తమ్ముడిపై కాస్త మమకారం, అనురాగం, ఆప్యాయత లాంటివి కామన్‌గా ఉండొచ్చు. అయితే ఆమె శివజ్యోతి కాబట్టి ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. కాని మరీ ఈ రేంజ్‌లో ఉంటే మేం తట్టుకోవడం కష్టం శివజ్యోతి అంటే ఆమెపై ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు నెటిజన్లు.

👉8⃣ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఇంట్రస్టింగ్..:

ఏడో వారంలో అలీ రాజా బ్యాగ్ సర్దేయగా.. మిగిలిన 11 మందిలో ఒకర్ని ఎనిమిదో వారంలో ఇంటికి పంపేందుకు ఎలిమినేషన్ ప్రాసెస్‌ను మొదలుపెట్టారు బిగ్ బాస్. ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న 11 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు బిగ్ బాస్. అయితే హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ 1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. గ్రూప్‌ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

🔴బిగ్‌బాస్ 3 హౌస్ నుండి 8వ వారం ఎలిమినేట్ కాబోతున్నారంటే :

శిల్పా చక్రవర్తి,
పునర్నవి,
మహేష్ విట్టా,
హిమజ,
శ్రీముఖి.

👉ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..:

👉రవి.. రాహుల్, శిల్ప
👉పునర్నవి.. మహేష్, శ్రీముఖి
👉శివజ్యోతి.. పునర్నవి, శిల్ప
👉శిల్ప చక్రవర్తి.. జ్యోతి, హిమజ
👉శ్రీముఖి.. పునర్నవి, శిల్ప
👉వితిక.. రవి, రాహుల్
👉హిమజ.. శిల్ప, వితిక
👉వరుణ్.. మహేష్, హిమజ
👉మహేష్.. పునర్నవి, వరుణ్
👉రాహుల్.. శ్రీముఖి, రవి
💥ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఎక్కువ మంది శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలను నామినేట్ చేయడంతో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు.

⭐బాబా భాస్కర్‌కి ప్రత్యేక అధికారం..:

హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి ప్రత్యేక అధికారం ఇచ్చారు బిగ్ బాస్. నామినేషన్‌లో ఉన్న శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి ఆరుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో రవిని సేవ్ చేశారు బాబా భాస్కర్.

👉ప్రస్తుతానికి అయితే అలీ రజా ఎలిమినేషన్‌, శివజ్యోతి ఏడుపుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మాత్రం మామూలుగా లేవు…


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading