షాకింగ్ న్యూస్ :పశ్చిమ్ బెంగాల్‌లో కేంద్ర మంత్రిని జట్టుపట్టుకుని నెట్టేసిన విద్యార్థులు!

Spread the love

Teluguwonders:

పశ్చిమబెంగాల్‌లోకేంద్రమంత్రి కు చేదు అనుభవం ఎదురైంది. కాగా కేంద్ర మంత్రి పర్యటనపై ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, పోలీసులు సైతం యూనివర్సిటీ బయట వేచి ఉన్నారని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు

💥కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు ఊహించని పరిణామం:

పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం నిర్వహించిన సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు అక్కడ విద్యార్థుల నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యింది.

🔴 వివరాల్లోకి వెళ్తే :

కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు పశ్చిమబెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది.
జాదవ్‌పూర్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఘోరావ్ చేశాయి. కేంద్ర మంత్రికి నల్లజెండాలు చూపించి వెనక్కి వెళ్లిపోవాలంటూ కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఏబీవీపి నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బాబుల్‌ సుప్రియోను వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రాంగణంలోకి రాకుండానే దాదాపు గంటన్నర సేపు అడ్డుకున్నారు. అతికష్టంతో సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రిని తర్వాత బయటకు వెళ్లకుండా చుట్టుముట్టారు. చివరికి గవర్నర్ అక్కడకు చేరుకుని జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

చివరికి అధ్యాపకులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కేంద్ర మంత్రిని విద్యార్థులు అడ్డుకున్న విషయం తెలిసిన గవర్నర్ యూనివర్సిటీ క్యాంపస్‌కు చేరుకున్నారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను కూడా అక్కడకు రప్పించారు. అయితే, యూనివర్సిటీ గేట్లు మూసివేసిన విద్యార్థులు సీఆర్పీఎఫ్ దళాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ ఘటనను గవర్నర్ కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

అతికష్టంతో బయటపడిన కేంద్ర మంత్రి సుప్రియో మాట్లాడుతూ.. తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదన్నారు. పలువురు తనను అవహేళన చేశారని, నా జుట్టు పట్టుకుని లాగి నెట్టివేశారని కేంద్ర మంత్రి తెలిపారు. తమను తాము నక్సల్స్‌గా పేర్కొంటూ నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని బాబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర గవర్నర్‌ విశ్వవిద్యాలయానికి వచ్చారు. ఆయనను కూడా విద్యార్థులు అడ్డగించి నినాదాలు చేశారు.

మరోవైపు, గవర్నర్ చర్యలపై అధికార తృణమూల్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులను ఏ మాత్రం సంప్రదించకుండా గవర్నర్ నేరుగా జోక్యంచేసుకోవడం ఏంటని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వ తొత్తుగా గవర్నర్ వ్యహరిస్తున్నారని తృణమూల్ పార్టీ దుయ్యబట్టింది. ఇందులో తమ పార్టీ గానీ, పోలీసులు గానీ జోక్యం చేసుకోలేదని ఇది కేవలం బీజేపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న వివాదం మాత్రమేనంటూ ఉద్ఘాటించింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading