భారత్‌‌ను దోషిగా చూపేందుకు పాకిస్థాన్ చేస్తున్న కొత్త కుట్ర

Pakistan's new conspiracy to convict India
Spread the love

Teluguwonders:

కశ్మీర్ అంశంపై రాద్ధాంతం చేస్తున్న దాయాది పలు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతూ భారత్‌‌ను దోషిగా చూపేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో కొత్త నాటకానికి తెరతీసింది.

భారత్‌పై పాకిస్థాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ హబీబ్ జహీర్ అదృశ్యం వెనుక భారత్ హస్తముందని బుధవారం పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఏప్రిల్ 2017లో పాక్ కల్నల్ హబీబ్ జహీర్ నేపాల్‌లో అదృశ్యమయ్యారు. ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం నేపాల్ వెళ్లిన హబీబ్ పాక్‌కు తిరిగిరాలేదు. కుల్‌ భూషణ్ జాదవ్‌ అరెస్టుకు ప్రతీకారంగా కల్నల్ హబీబ్‌ను భారత్ అపహరించినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. లెఫ్టినెంట్ కల్నల్ హబీబ్ జహీర్ ఏప్రిల్ 2017లో నేపాల్‌కు ఇంటర్వ్యూ కోసం వెళ్లారని, ఆయన అదృశ్యం వెనుక శత్రువుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.

తమ అధికారి కనిపించకుండాపోయిన రెండేళ్ల తర్వాత పాకిస్థాన్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం విశేషం. జాదవ్‌కు పాక్ మిలటరీ ఆర్బిటర్ కోర్డు శిక్ష ఖరారుచేసిన కొద్ది రోజుల్లోనే నేపాల్ సరిహద్దుల్లో హబీబ్‌ను ట్రాప్‌చేశారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. భారత్- నేపాల్ సరిహద్దుల్లోని లుంబినీ వద్ద ఆయనను భారత దళాలే అపహరించి ఉంటాయని ఆరోపించాడు. హబీబ్ ఆచూకీ గురించి చెప్పాలని భారత్‌ను పదే పదే అర్ధించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పాక్ వ్యాఖ్యానించింది.
అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థను కూడా సంప్రదించినట్టు తెలిపారు. హబీబ్ అదృశ్యం గురించి భారత్‌తోపాటు చుట్టుపక్కల దేశాలకు సమాచారం ఇచ్చినట్టు వివరించాడు. ఐరాస వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం హబీబ్ జహీర్ లింక్‌డ్‌ఇన్‌లో తన సీవీని పోస్ట్ చేశాడని ఆయన కుటుంబం చెప్పినట్టు పాక్ విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నాడు.ఏప్రిల్ 6 మధ్యాహ్నం 1 గంటకు బుద్ధ ఎయిర్ ద్వారా కాఠ్మాండులోని లుంబినీ ఎయిర్‌పోర్ట్‌లో హబీబ్ దిగినట్టు తన భార్యకు మెసేజ్ చేశాడు.. భారత సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయంలో దిగిన తర్వాత అతడి మొబైల్ పనిచేయలేదని పాక్ అధికార ప్రతినిధి విమర్శించాడు.

‘కొద్ది రోజుల తర్వాత సీవీ షార్ట్‌లిస్ట్ చేశామని, ఇంటర్వ్యూ కోసం కాఠ్మాండ్ రావాల్సి ఉంటుందని మార్క్ అనే వ్యక్తి కాల్ చేసిన చెప్పారు.. 2017 ఏప్రిల్ 6న నేపాల్‌కు విమాన టిక్కెట్‌ బుక్ చేసి పంపారు. అయితే, విచారణలో అది నకిలీ కాల్‌గా తేలిందని, ఆ వెబ్‌సైట్ కూడా భారత్‌ నుంచి ఆపరేట్ అయినట్టు నిర్ధరణ అయ్యింది’అని ఆరోపించాడు. 👉అంతేకాదు, భారత నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ నిర్బంధానికి ప్రతీకారంగా తమ కల్నల్‌ను అపహరించారని ఆరోపించడం గమనార్హం.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading