ఆంధ్రా ఊటీకి అద్దాల రైలు….

Spread the love

త్వరలో అరకు స్పెషల్‌ టూరిస్ట్‌ రైలు6 విస్టోడామ్‌ కోచ్‌లతో సర్వీస్‌ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్‌ ట్రైన్‌\స్థానంలో నడిపేందుకు ప్రణాళికలు పర్యాటకులు ఖుషీవిదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాల్ని చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఐదు విస్టోడామ్ కోచ్లు ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 కోచ్లతోపాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అందంగా ఉంటుంది. అద్భుతాల్ని వీక్షించేందుకు అందమైన రైలులో ప్రయాణిస్తే.. లెక్కలేనన్ని మధురానుభూతుల్ని మూటకట్టుకోవచ్చు.

అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ ట్రైన్
అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్‌ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్‌ రైలుకు ఏర్పాటు చేసిన విస్టాడోమ్‌ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్‌ టూరిస్ట్‌ రైలు చక్కర్లు కొట్టనుంది. ఒక్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మాత్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కానీ.. కొత్తగా రానున్న టూరిస్ట్‌ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాల్ని అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది.

84 వంతెనలు.. 58 సొరంగాలు..
ఈ విస్టాడోమ్‌ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్‌ సీట్‌లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎల్తైన కొండలూ.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు వరకూ పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. కదిలే రైల్లో విస్టాడోమ్‌ కోచ్‌ నుంచి వీటిని చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది.

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading